telugu navyamedia
సినిమా వార్తలు

“సాహో”లో పాయల్ స్పెషల్ సాంగ్… క్లారిటీ ఇచ్చిన భామ

payal special song in sita movie

“ఆర్ఎక్స్100” చిత్రంతో తెలుగులోకి తెరంగేట్రం చేసిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇప్పుడు “వెంకీమామ‌”, “డిస్కోరాజా” చిత్రాల్లో న‌టిస్తుంది. బాల‌కృష్ణ త‌దుప‌రి చిత్రంలో కూడా హీరోయిన్‌గా పాయ‌ల్ పేరు విన‌ప‌డుతుంది. హీరోయిన్‌గానే కాకుండా ఈ అమ్మ‌డు “సీత‌” చిత్రంలో స్పెష‌ల్ సాంగ్‌లో ఆడిపాడింది. తాజాగా ఈ బ్యూటీ ప్ర‌భాస్ “సాహో”లో కూడా ఓ స్పెష‌ల్‌సాంగ్ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు వార్త‌లు వచ్చాయి. అయితే ఈ వార్త‌ల‌ను పాయ‌ల్ రాజ్‌పుత్ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తోసి పుచ్చారు. తాను “సాహో”లో ఎలాంటి స్పెషల్ సాంగ్ చేయడం లేదంటూ స్పష్టం చేసింది. దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్‌తో తాను స్పెషల్ సాంగ్‌ చేయబోతున్నట్లు వస్తున్న వార్తలకు చెక్ పెట్టేసిందీ పాయల్ రాజ్‌పుత్.

Related posts