telugu navyamedia
సినిమా వార్తలు

ఆ వార్తలను నమ్మకండి : పాయల్ రాజ్ పుత్

payal rajput

గ‌త ఏడాది “ఆర్ఎక్స్ 100” అనే సినిమాలో తన హాట్ అందాల‌తో కుర్ర‌కారుని క‌వ్వించ‌డ‌మే కాదు, నటనతో కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ తరువాత అవ‌కాశాలు వెల్లువెత్తినా, ఈ బ్యూటీ ఏ మాత్రం తొంద‌ర‌ప‌డ‌కుండా మంచి పాత్ర ప్రాధాన్యం ఉన్న స్క్రిప్ట్స్‌నే ఎంచుకుంటుందీ. ఈ పంజాబీ పాల‌కోవా ప్ర‌స్తుతం “వెంకీమామ‌”లో వెంక‌టేష్‌తో, “డిస్కోరాజా”లో ర‌వితేజ‌తో జతకట్టనుంది. అలాగే “RDX ల‌వ్‌” అనే ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో న‌టిస్తుంది. భాను శంక‌ర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ సినిమా పాయ‌ల్ తొలి తెలుగు చిత్రం “RX 100″కు సీక్వెల్ అని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో త‌న సినిమాపై వ‌స్తున్న రూమ‌ర్స్‌ను న‌మ్మొద్దంటూ పాయ‌ల్ క్లారిటీ ఇచ్చింది. “RX 100`కు `RDX ల‌వ్‌`సీక్వెల్ కాద‌ని.. ఇది డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీ అని ఇన్‌స్టా గ్రామ్ ఖాతా ద్వారా తెలియ‌జేసింది.

Related posts