telugu navyamedia
సినిమా వార్తలు

గజదొంగ బయోపిక్ లో బోల్డ్ బ్యూటీ

Bellamkonda-Srinivas-and-Payal-Rajputh

“ఆర్ఎక్స్ 100” సినిమా తరువాత పాయల్ రాజ్ పుత్ కు యూత్ లో భారీ క్రేజ్ వచ్చింది. తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా బోల్డ్ బ్యూటీగా పాపులర్ అయ్యింది. వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నప్పటికీ మంచి ప్రాధాన్యమున్న కథలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం తెలుగులో పాయల్ వెంకటేష్ సరసన “వెంకీ మామ”, నాగార్జునకు జోడిగా “మన్మథుడు-2″లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఈ బోల్డ్ బ్యూటీ. మరోవైపు తమిళంలో కూడా సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ అగ్రహీరోలకు జతగా అవకాశం దక్కించుకున్న ఈ భామ సోషల్ మీడియాలో కూడా తన హవా కొనసాగిస్తోంది. హాట్ హాట్ ఫొటోలతో, వీడియోలతో నెటిజన్లకు నిద్ర కరువయ్యేలా చేస్తోంది.

తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ మరో సినిమాలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. దర్శకుడు వంశీకృష్ణ “టైగర్ నాగేశ్వరరావు” బయోపిక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. దొంగతనాలు చేయడంలో మంచి నేర్పరి. పోలీసులకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. 1980-90లలో స్టువర్టుపురం గజదొంగగా “టైగర్ నాగేశ్వరరావు” ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. ఆయన బయోపిక్ లో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించనున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ కు జంటగా పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్నారు. బుర్రా సాయిమాధవ్ ఈ సినిమాకి సంభాషణలను సమకూర్చుతున్నారు.

Related posts