telugu navyamedia
సినిమా వార్తలు

శ్రీశ్రీ సమున్నత శిఖరం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు మంచి స్నేహితులు . వారిద్దరు కలసినప్పుడల్లా ఏం మాట్లాడుకుంటారని అంద‌రికి సందేహం క‌ల‌గొచ్చు.. పవన్, త్రివిక్రమ్ సాహిత్య మిత్రులు కావడంతో తరుచూ పలువురు సాహితీవేత్తలు, వాళ్ల రచనలను గుర్తుచేసుకుంటూ ఆనందిస్తుంటారంట‌.

మహాకవి శ్రీశ్రీ ఒక శిఖరంలాంటి వారని ప్రముఖ దర్శకుడు, మాటల రచయిత త్రివిక్రమ్ అన్నారు.‘కవి తాలూకు ప్రయాణం అంటే.. ఒక జాతి తాలుకు ప్రయాణం. ఆయన వేసిన ఒక అడుగు…రాసిన ఒక పుస్తకం.. ఒక శతాబ్దం మొత్తం మాట్లాడుకుంటుంది. చాలా శతాబ్దాల పాటు మాట్లాడుకుంటునే ఉంటుంది. ఆయన తాలూకు జ్ఞాపకం మనజాతి పాడుకొనే ఒక గీతం.. శ్రీశ్రీ తెలుగువారు గర్వించతగ్గ కవి. ఈ శతాబ్దం నాది అని గర్వంగా చాటినవాడు. శ్రీశ్రీ ముందు తనలాంటి వాళ్లందరూ గులకరాళ్లంటూ వ్యాఖ్యానించారు.

ఈ క్ర‌మంలో  శ్రీశ్రీ చేతిరాతతో ఉన్న రూపొందించిన ‘మహా ప్రస్థానం’ ప్రత్యేక స్మరణికను ‘భీమ్లా నాయక్’ సెట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కు జ్ఞాపికగా అందచేశారు. ఈ సందర్భంగా వారిద్దరురూ శ్రీశ్రీ కవితలను, సాహిత్యాన్ని గుర్తుచేసుకొని మురిసిపోయారు.

మహాకవి శ్రీశ్రీ రచనా వైశిష్ట్యం గురించి, ఆయన తన రచనల్లో పదాల్ని ఎలా పరుగులు పెట్టించి పాఠకుల్ని చైతన్య పరుస్తారు అనే విషయం గురించి .. ముఖ్యంగా యువరక్తాన్ని వేడెక్కించిన మహా ప్రస్థానం ..ఆ పుస్తక ముద్రణ, అందులోని అరుదైన చిత్రాల గురించి, అలాగే మహా కావ్యం గురించి చాలా ప్రత్యేకంగా చర్చించుకున్నారు. ఒక కవి మరో కవి గురించి చెబుతుంటే వచ్చే సొబగు బాగుందని పవన్ కల్యాణ్ అన్నారు.

Related posts