రాజకీయ వార్తలు సినిమా వార్తలు

పవన్ నిరసన దీక్షలో అభిమానులు "సీఎం" అంటూ కేరింతలు

తన తల్లిని దూషించినందుకు నిరసనగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఈరోజు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో నిరసన దీక్ష చేపట్టారు.

ఛాంబర్ కార్యాలయం ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని మౌనవ్రతం పాటించారు. దాదాపు మూడుగంటల సేపు పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఛాంబర్ లోనే ఉన్నారు. ఆయనకు మద్దతుగా అల్లు అరవింద్, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, కేఎస్ రామారావు, ఎన్వీ ప్రసాద్, వివి వినాయక్, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు వచ్చారు. పవన్ కళ్యాణ్ ఫిలిం ఛాంబర్ లో నిరసన చేపడుతున్నాడనే వార్త టీవీలో రావడం చూసిన అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. పవన్ కళ్యాణ్ ను చూసి “సీఎం పవన్ కళ్యాణ్” అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు.

pavan-2

తమ తల్లిని అంత మాటన్నందుకు దీక్ష చేపడుతున్నామని పవన్ అంతకుముందు ట్వీట్స్ చేశారు. ఇదే సమయంలో రాజకీయంగా తనను దెబ్బ తీయడానికి నారా లోకేష్ సచివాలయం సాక్షిగా కుట్ర పన్నినట్టు కూడా పవన్ ఆరోపించారు.

ఈరోజు చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో ధర్మదీక్ష చేపడుతుంటే మీడియా ఫోకస్ అంతా చంద్రబాబు మీదే ఉంది. చంద్రబాబును అయన కుమారుడు లోకేష్ ను టార్గెట్ చేస్తూ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో హఠాత్తుగా పవన్ కళ్యాణ్ వచ్చి దీక్ష చేయడంలో అంతరార్థం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. ఒకవైపు తన తల్లికి జరిగిన అవమానానికి నిదర్శనంగా దీక్ష అంటూనే, అదే సమయంలో చంద్రబాబు, లోకేష్ లపై ఆయన చేస్తున్న విమర్శలు కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి.

pavan-3

మూడ్రోజుల క్రితం శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ అన్న మాటలకు ఈరోజు ఆయన స్పందించడం వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఏమైనా పవన్ కళ్యాణ్ ఈరోజు హైదరాబాద్ లో దీక్ష చేపట్టి మీడియా దృష్టిని మళ్లించారు.

పవన్ కళ్యాణ్ రాకతో ఛాంబర్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అందుకే పోలీసులు ఛాంబర్ కు అభిమానులు ఎక్కువగా రావడంతో తోపులాట జరిగే అవకాశం ఉందని, పవన్ ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారట. దాంతో పవన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Related posts

ప్రకృతి పై ప్రేమతో… కంగనా

admin

పరిపూర్ణానంద నగర బహిష్కరణ వెనుక రాజకీయ హస్తం!

madhu

కాగ్ నివేదిక కేసీఆర్ ప్రభుత్వానికి చెంప పెట్టు : లక్ష్మణ్

admin

Leave a Comment