telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గాజువాకలో పవన్‌ నామినేషన్

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. విశాఖ నగరపాలక సంస్థ జోన్‌-5 కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా జోన్ 5 కార్యాలయానికి భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు తరలివచ్చారు. లోపలికి వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అయినప్పటికీ కార్యకర్తలు వెళ్లకపోవడంతో పోలీసులు చెదరగొట్టారు.

నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్ అనంతరం అక్కడ నుంచి కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. అనంతరం గాజువాక, భీమునిపట్నం, విశాఖ సౌత్ నియోజకవర్గాల్లో జరగబోయే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు పవన్ బయలు దేరారు. ఇక శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం అభ్యర్థిగా జనసేన అధినేత నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Related posts