telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వకీల్ సాబ్”కు మరో మూడు నెలల సమయం…?

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ రూపొందుతోంది. ఈ సినిమాను దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌ సరసన శ్రుతీ హాసన్ నటిస్తోంది. నివేథా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీపై పవన్‌ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగు పార్టు పూర్తి కావాల్సింది. కానీ లాక్ డాన్ కారణంగా ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. ఇక ఈ నెల నుంచి తెలంగాణలో షూటింగ్‌లకు అనుమతి లభించడంతో.. త్వరలోనే వకీల్‌ సాబ్‌ను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ పూర్తయ్యే సరికి మూడు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. మూవీకి సంబంధించిన షూటింగ్ 35 రోజులు ఉండగా.. మిగిలిన పనులన్నీ పూర్తయ్యే సరికి దాదాపుగా మూడు నెలలు పట్టనుందట. ఈ క్రమంలో ఈ సినిమాను అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దిల్ రాజు భావిస్తున్నట్లు టాక్.

Related posts