telugu navyamedia
సినిమా వార్తలు

మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు విజయనిర్మల : పవన్

టాలీవుడ్ నటి, దర్శకురాలు విజయ నిర్మల గత రాత్రి గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆమె పార్థివదేహాన్ని నానక్‌రామ్‌గూడలోని ఆమె స్వగృహానికి తీసుకొచ్చారు. అభిమానుల సందర్శనార్థం నేడు అక్కడే ఉంచి రేపు ఉదయం ఫిలించాంబర్‌కు తరలిస్తారు. శుక్రవారం మ‌హా ప్ర‌స్థానంలో విజయ నిర్మల అంత్యక్రియలు జరగనున్నాయి. ఇంటికి చేరిన విజయ నిర్మల పార్థివదేహాన్ని చూసిన కృష్ణ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆమె మరణం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయినట్లు తెలిపారు. “కృష్ణ గారికి, నరేష్ గారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నటిగా దర్శకురాలిగా విజయనిర్మల గారి ముద్ర చెరగనిది. మీనా, హేమాహేమీలు, రామ్ రాబర్ట్ రహీమ్ లాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి ఈ విభాగంలో మహిళలు ప్రవేశించేందుకు స్ఫూర్తిగా నిలిచారు. విజయనిర్మల గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Related posts