telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ డైలాగ్ లీక్… “పింక్” రీమేక్

Pawan

కొన్ని రోజుల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటున్నాడు. తన 26వ సినిమాగా ‘పింక్’ రీమేక్‌ని ఎంచుకున్నాడు. హిందీ, తమిళ్ భాషల్లో ‘పింక్’ చిత్రాన్ని నిర్మించిన బోని కపూర్, దిల్ రాజుతో కలిసి నిర్మిస్తుండగా వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకి ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన వీడియో ఒకటి లీకైంది. ఓ వ్యక్తితో ఫైట్ చేస్తూ.. ‘నేను నల్లకోటు వేసుకుంటే.. వేసుకోవటానికి పిటీషన్లు, తీసుకోవటానికి బెయిళ్లు ఉండవు’’ అని పవన్ కళ్యాణ్ డైలాగ్ చెబుతూ కనిపించారు. షూటింగ్ స్పాట్‌లో ఉండే వ్యక్తులే రహస్యంగా రికార్డు చేసి లీక్ చేసేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ పవన్ కళ్యాణ్ నల్ల దుస్తుల్లో నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోలు లీక్ అయ్యాయి. దాంతో సెక్యూరిటీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడంలేదని పవన్ నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఇరవై ఐదు సెకన్ల నిడివి ఉన్న వీడియో కూడా లీక్ అయిపోయింది. మరి ఇది చూశాక పవన్ ఎలా స్పందిస్తారో ?

Related posts