telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మీ పాటని లెక్కలేనన్నిసార్లు చూశాను… హీరోకు పవన్ రిప్లై

Pawan

సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డేను పురస్కరించుకుని చాలామందిలాగే తమిళ హీరో శివకార్తికేయన్ సోషల్ మీడియా ద్వారా పవన్ కి విషెస్ తెలిపాడు. దీనికి పవన్ స్పందిస్తూ “ప్రియమైన తిరు శివ కార్తికేయన్, మీరు పంపిన శుభాకాంక్షలకు కృతజ్ఞతలు. మీరు ఎన్నో విజయాలు సాధించాలని అభిలషిస్తున్నాను. ఇక, మీ ‘ఊదా కలర్ రిబ్బన్..’ అనే పాట అంటే నాకు చాలా ఇష్టం. ఈ పాటని లెక్కలేనన్నిసార్లు చూశాను” అంటూ పవన్ ట్వీట్ చేశారు. ఈ పాట ‘వరుత్త పాడదా వాలిబార్ సంగం’ అనే సినిమాలోనిది. దీంతో శివ కార్తికేయన్ ఆనందంలో మునిగిపోయారు. పవన్ ట్వీట్ కు స్పండిస్తూ “మీ జవాబు చూసి అమితానందాన్ని పొందాను సార్. “ఊదా కలర్ రిబ్బన్” పాట మీకిష్టమని తెలిసి మరింత ఆనందాన్ని పొందాను. మీరు సమయాన్ని వెచ్చించి నాపై ప్రేమ చూపుతూ జవాబు ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞుడిని సార్” అంటూ ట్వీట్ చేశాడు. కాగా తన పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలుపుతున్నారు పవన్.

Related posts