telugu navyamedia
సినిమా వార్తలు

పవన్, బోయపాటి కాంబినేషన్ లో సినిమా… బండ్ల గణేష్ నిర్మాతగా…!?

2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీకి తీవ్ర పరాజయం ఎదురైంది. దీంతో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తారనే వార్తలువిన్పిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌లకు చాలా స‌మయం ఉండ‌టంతో ప‌వ‌న్‌ కళ్యాణ్ తప్పకుండా సినిమా ఫీల్డ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తార‌ని అంటున్నారు. ఇక ప‌వ‌న్‌ కళ్యాణ్ కు ఎప్పుడో అడ్వాన్సులు ఇచ్చిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు ఆయ‌న‌తో సినిమా చేయాల‌ని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప‌వ‌న్‌ కళ్యాణ్ తో సినిమా చేయాల‌ని బండ్ల గ‌ణేష్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ట‌. ప‌వ‌న్‌కు 40 కోట్ల రూపాయ‌ల‌ రెమ్యునేష‌న్ కూడా ఆఫ‌ర్ చేశాడ‌ట‌. మాస్ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో తనదైన శైలి చూపించే బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని అంటున్నారు. బోయపాటికి 10 కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేశాడ‌ట బండ్ల‌. రెమ్యున‌రేష‌న్స్ కాకుండా సినిమాను మరో 50 కోట్ల‌లో పూర్తి చేయాల‌నుకుంటున్నార‌ని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు ఎదురు చూడాల్సిందే.

Related posts