telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

తమిళనాడు సీఎంపై పవన్‌ కళ్యాణ్‌ ప్రశంసలు

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమిళనాడు సీఎం స్టాలిన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. స్టాలిన్ పాలన దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆదర్శమంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మాటలే కాదు.. చేతల్లోనూ పాలన ఎలా ఉండాలో చూపిస్తున్నారని మెచ్చుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

‘‘ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేందుకు రాజకీయాలు చేయాలే తప్ప.. అధికారంలోకి వచ్చాక చేయకూడదు. ఆ విషయాన్ని మీరు మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చేసి చూపిస్తున్నారు. మీ పాలన, పనితీరు తమిళనాడు ఒక్క దానికే కాదు.. దేశంలోని మిగతా రాష్ట్రాలకూ, రాజకీయ పార్టీలకూ ఆదర్శం, మార్గదర్శి. అంత మంచి పాలన అందిస్తున్న మీకు మనస్ఫూర్తిగా అభినందనలు’’ అంటూ స్టాలిన్ ను ప్రశంసించారు.

 

Related posts