telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మరో రెండు రోజులో మరో సినిమా అనౌన్స్ చేయనున్న పవన్…

Pawan

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో ప్రాజెక్ట్‌ చేసేందుకు సిద్దంగా ఉన్నాడన్న ప్రకటన మరింత క్రేజీగా మారింది. ప్రస్తుతం పవన్ బాలీవుడ్ సినిమా పింక్‌ను తెలుగులో వకీల్ సాబ్‌గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనేక వాయిదాలతో ముందుకు సాగుతోంది. మొదట పవన్ రాజకీయ సమస్యలు, తరువాత మెగా డాటర్ వివాహం తదితర వాయిదాల తరువాత ఈ సినిమా చివరి షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. అయితే మెగా డాటర్ నిహారికా వివాహానికి వెళ్లేందుకు పవన్ ఈ సినిమా నుంచి కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్నాడు. పెళ్లి పూర్తయిన తరువాత మళ్లీ చిత్రీకరణలో పాలుపంచుకున్నారు. మొదటగా వచ్చే ఏడాది సంక్రాంతిపోరులో వకీల్ సాబ్ తలపడనున్నాడని అన్నారు. అయితే దాని నుంచి తప్పుకొని వేసవిలో విడుదలకు సిద్దం అవుతోంది. అయితే పవన్ ఈ సినిమా అనంతరం మరో రీమేక్‌లో చేయనున్నాడని సమాచారం. అయ్యప్పనమ్ కోషియం అనే సినిమాను రీమేక్ చేయనున్నారని, ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టుకు పవన్ ఇప్పటికే ఓకే చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని సోమవారం పూజా వేడుకతో ప్రారంభించనున్నారు. ఇక షూటింగ్ విషయానికొస్తే వచ్చే ఏడాది జనవరీ 2నుంచి హైదరాబాద్‌లో ప్రారంభిస్తారు. ఇందులో చేయనున్న నటీనటులపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Related posts