telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సేవ్ నల్లమల ఉద్యమం పై పవన్ విస్తృత ప్రచారం

pawan-kalyan

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యతిరేకిస్తున్నారు. సేవ్ నల్లమల ఉద్యమం పై ప్రచారం తన ప్రచారాన్ని సోషల్ మీడియాలో మరింత విస్తృతం చేస్తున్నారు. తాజాగా, ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ విక్రమ్ సోని వ్యాఖ్యలను ఉదహరిస్తూ ట్వీట్ చేశారు. విక్రమ్ సోని రాసిన నేచురల్లీ అనే పుస్తకం నుంచి కొన్ని వ్యాక్యాలను ట్విట్టర్ లో పోస్టు చేశారు.

“ఎంతో సంపద మనముందున్నా మనిషికి పరిపూర్ణ సంతృప్తి, శాంతి అనేవి దొరకడంలేదు. జీవితం మరీ వేగవంతం, ఒత్తిళ్లమయం అయిపోతోంది. మనశ్శాంతి కోసం ప్రతి ఒక్కరూ యోగాను ఆశ్రయిస్తున్నారు. జీవనశైలిని మార్చుకోవడానికి బదులు సమస్యలకు తక్షణ విరుగుడు ఏంటా అని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో గొప్ప అరణ్యాలు తుడిచిపెట్టుకుపోయి, ప్రకృతి చిన్నచిన్న దీవుల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి మనం నేషనల్ జియోగ్రాఫిక్ చానల్, డిస్కవరీ, యానిమల్ ప్లానెట్ వంటి చానళ్లలో ప్రకృతిని చూసి సరిపెట్టుకోవాల్సి వస్తోందంటూ ప్రొఫెసర్ సోని వ్యాఖ్యలను పిక్ రూపంలో పవన్ ట్వీట్ చేశారు.

Related posts