telugu navyamedia
సినిమా వార్తలు

ఆకట్టుకుంటున్న చిరు, పవన్ కొత్త లుక్

Pawan

తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, చిరంజీవి కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన మెగా అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే ఎన్నికల తరువాత తొలిసారి పవన్ కళ్యాణ్, చిరంజీవిని కలిసి దిగిన ఫోటో ఇది. సైరా షూటింగ్ పూర్తి కావడంతో రిలాక్స్ అయిన చిరంజీవిని జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి కలిశారు. “సైరా” సినిమా షూటింగ్ విశేషాలతో పాటు ఎన్నికల్లో జనసేన పార్టీ ఏ రకంగా ప్రజల్లోకి వెళ్లిందనే విషయాల గురించి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ చిరంజీవితో చర్చించినట్టు తెలుస్తోంది. ఇక సైరా సినిమా కోసం ఏడాదికి పైగా గడ్డంతో కొత్త లుక్‌ను కొనసాగిస్తూ వచ్చిన మెగాస్టార్ చిరంజీవి…పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌తో భేటీ సందర్భంగా తన కొత్త లుక్‌తో కనిపించారు. వీరిద్దరితో కలిసి చిరంజీవి దిగిన ఫోటో మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది.

Related posts