telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ కార్మికుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి: పవన్

pawan-kalyan

హైదరాబాదులోని జనసేన కార్యాలయంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల యూనియన్ల జేఏసీ నిర్ణయం మేరకు ఈ నెల 19న తలపెట్టిన తెలంగాణ బంద్ కు సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్టు పవన్ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడాలని జనసైనికులకు ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె తీవ్ర రూపం దాల్చిందని అన్నారు. ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు బలవన్మరణానికి పాల్పడటం సమ్మె తీవ్రతను తెలియజేస్తోందని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఎంత వరకు ఆమోదయోగ్యం అనే అంశాన్ని పక్కన పెట్టి, వారి ఆవేదనను అర్థం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని తెలిపారు. ఒకేసారి 48 వేల మంది కార్మికుల ఉద్యోగాలను తొలగించడం తనకు ఎంతో ఆవేదనను కలిగిస్తోందని అన్నారు. 

Related posts