telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జనసేనను విలీనం చేసే ప్రసక్తే లేదు: పవన్ కల్యాణ్

pawan-kalyan

ఏ పార్టీలోనూ జనసేనను విలీనం చేసే ప్రసక్తే లేదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేనను కలిపేయాలంటూ ఒక పెద్ద పార్టీ తనపై తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తోందని చెప్పారు. జాతి సమగ్రతను కాపాడటం కోసమే జనసేనను ప్రారంభించామని… అందుకే మరే పార్టీలో జనసేనను కలపబోమని తెలిపారు.

తన బలమేంటో, బలహీనత ఏంటో తనకు తెలుసని పవన్ అన్నారు. సత్యం కోసం తాను పని చేస్తానని తెలిపారు. ఏ విషయంలోనైనా ఎవరికైనా అభిప్రాయాలు ఉంటే చెప్పాలని సూచించారు. అలా కాకుండా రోడ్ మీదకు వెళ్లో, సోషల్ మీడియాలో పోస్టుల పెట్టడం ద్వారానో చెబితే వినడానికి ఇది కాంగ్రెస్ పార్టీ కాదని అన్నారు. సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. జనసైనికులంతా వరద బాధితులకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు.

Related posts