telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మానవ మనుగడకు పంచభూతాలే ఆధారం: పవన్ కల్యాణ్

pawan

మానవ మనుగడకు పంచభూతాలే ఆధారమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. నింగి, నీరు, నేల, నిప్పు, గాలితో సమ్మిళితమైన పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడే మానవజాతి శోభిల్లుతుందన్నారు.

మానవ జాతి సౌభాగ్యానికి పర్యావరణమే మూలమని అన్నారు. పర్యావరణ పరిరక్షణ తమ పార్టీ మూల సిద్ధాంతమని చెప్పారు. పర్యావరణం ఉన్న చోట ఆసుపత్రుల అవసరం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారని చెప్పారు. పంచభూతాలను కాపాడుకుందామని పవన్ పిలుపునిచ్చారు.

Related posts