telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సిపిఐ, సిపిఎంలతో కలిసి పోటీ: పవన్

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సిపిఐ, సిపిఎంలతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెల్లిపారు. టీడీపీ , వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలతో కలిసి పనిచేసే ప్రసక్తి లేదని పవన్ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం ఒంగోలులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేశానని తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీడీపీ అమలు చేయలేదని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ ఏపీ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.

విశాఖ రైల్వే జోన్‌ ముందుగా ప్రకటించి ఉంటే బీజేపీని అభినందిచేవారని, ఎన్నికల సమయంలో ప్రకటించడం రాజకీయ లబ్దికోసమే అని ఆయన విమర్శించారు. ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు కొందరి అభివృద్ధినే మాత్రమే చూస్తున్నారని దుయ్యబట్టారు. బాధ్యతతో కూడిన ప్రభుత్వం రావాలని యువత కోరుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. 18-22 ఏళ్ల మధ్య ఉన్న యువతే ఎన్నికలను శాసిస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో దోపిడిరాజ్యం అంతంకావాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. యువత తమ మనోభావాలు చెప్పుకోడానికి జనసేనను ఒక ఆయుధంగా స్వీకరించిందని పవన్ అన్నారు.

Related posts