telugu navyamedia
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ ఎవర్ గ్రీన్ సాంగ్ రీమేక్

Pawan-Kalyan

“తొలిప్రేమ” ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ కళ్యాణ్ కెరీర్ లో మైల్ స్టోన్ వంటిది. ఎ.క‌రుణాక‌ర‌ణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రం పవన్ కళ్యాణ్ కు యూత్ లో విపరీతమైన క్రేజ్‌ను తెచ్చి పెట్టింది. ఎ.క‌రుణాక‌ర‌ణ్ ఈ సినిమాతో దర్శకుడిగా భారీ విజయాన్ని అందుకున్నారు. క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయిన ఈ సినిమా సాంగ్స్ మంచి ఆద‌ర‌ణ‌ను పొందాయి. ఇప్పుడు ఈ చిత్రములోని “ఈ మ‌న‌సే…” సాంగ్‌ను రీమేక్ చేస్తున్నారు. “ఆట‌గ‌ద‌రా శివ‌” ఫేమ్ ఉద‌య్ శంక‌ర్‌, ఐశ్వ‌ర్యారాజేశ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం “మిస్ మ్యాచ్‌”. నిర్మ‌ల్‌కుమార్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఐశ్వ‌ర్యారాజేశ్ రెజ్లర్ పాత్ర‌ను పోషించింది. ఈ సినిమాలో “ఈ మ‌న‌సే.. ” సాంగ్‌ను రీమేక్ చేశార‌ట‌. ఆసక్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ రీమేక్ సాంగ్‌ను సింగిల్ షాట్‌లో చిత్రీక‌రించార‌ట‌. విజ‌య్ మాస్ట‌ర్ నేతృత్వంలో రెండు, మూడు రోజుల పాటు ట్రైనింగ్ తీసుకుని నాలుగు నిమిషాల పాటు సాగే సాంగ్‌ను సింగిల్ షాట్‌లో చిత్రీక‌రించార‌ట‌.

Related posts