telugu navyamedia
andhra news political

రాజధానిని మార్చడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం: పవన్ కల్యాణ్

pawan-kalyan

ఏపీ రాజధాని అమరావతిని మార్చడం వల్ల ప్రజాధనం దుర్వినియోగమవుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజధానిగా అమరావతే సరైన ప్రాంతమని పవన్ వ్యాఖ్యానించారు. రాజధానిని తరలిస్తామని చెప్పడం సరికాదని హితవు పలికారు. రాజధాని మార్పును జనసేన వ్యతిరేకిస్తుందని తెలిపారు. రాజధాని కోసం తరతరాలుగా వస్తున్న భూములను రైతులు త్యాగం చేశారని కొనియాడారు.

కొందరు ఇష్టంగా భూములు ఇచ్చారని, మరికొందరు అయిష్టంగా ఇచ్చారని అన్నారు. అందుకే గతంలో తాను భూసేకరణ వద్దని రైతుల పక్షాన నిలబడ్డానని తెలిపారు. ఏదేమైనా రైతులు రాష్ట్రం కోసం పొలాలను వదులుకున్నారని చెప్పారు. రాజధాని అనేది కేవలం 29 గ్రామాల ప్రజల సమస్య కాదని, రాష్ట్ర సమస్య అని చెప్పారు. గత ప్రభుత్వాల నిర్ణయాల్లో తప్పులుంటే సరిదిద్దే ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు.

Related posts

కరోనా ప్రపంచ మహమ్మారే: డబ్ల్యూహెచ్ఓ

vimala p

రాశిఫలాలు : … పనికి గుర్తింపు.. ఆనందం రెట్టింపు..

vimala p

లాడ్జికి పిలిచిన ఫేస్‌బుక్ గర్ల్ ఫ్రెండ్..ఆ తర్వాత ఏమైదంటే..?

vimala p