telugu navyamedia
political Telangana

తెలంగాణలోవారికే ఓటెయ్యండని చెప్పిన.. పవన్

Pawan kalyan
అమరావతి: తెలంగాణ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలకు తన సందేశాన్ని అందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ గర్జించిన దాశరథి కృష్ణమాచార్య కవిత్వంతో పవన్ తన వీడియో సందేశాన్ని ప్రారంభించారు. పోరాట వీరుల స్ఫూర్తితో తెలంగాణ యువత స్వరాష్ట్రం సాధించుకుందన్నారు. ముందస్తు ఎన్నికలు రావడంతో జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేకపోయిందని చెప్పారు. తెలంగాణ సాధించామన్నవాళ్లు ఒకవైపు, తెలంగాణ ఇచ్చామన్నవాళ్లు మరోవైపు ఉన్నారని.. ఇప్పుడు తాను చెప్పేది ఒకటేనని.. ఎక్కువ పారదర్శకతతో, అవినీతి రహిత పాలన ఎవరు అందించగలరో వారికే ఓటెయ్యండని పిలుపునిచ్చారు. జై తెలంగాణ.. జైహింద్ నినాదాలతో తన ప్రసంగాన్ని పవన్ ముగించారు.

Related posts

ఇంటర్ ఫలితాల్లో మరో కోణం ..అర్హత లేకున్నా గ్లోబెరినాకు పనులు!

vimala p

సిమిపై .. మరో ఐదేళ్లు నిషేధం విధించిన ఇండియా..

ashok

నూజివీడు అసెంబ్లీ బరిలో బిగ్ బాస్2 సంజన!

vimala p