telugu navyamedia
సినిమా వార్తలు

మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల్లో పవన్

Pawan-Kalyan

మెగాస్టార్ చిరంజీవి 64వ జ‌న్మ‌దిన వేడుక‌ల‌కు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు ఆయన అభిమానులు. చిరు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరపడానికి మెగా ఫ్యామిలీ కూడా భారీగా సన్నాహాలు చేస్తోంది. ఆగ‌స్ట్ 21 సాయంత్రం 6గం.ల‌కి శిల్ప క‌ళావేదిక‌లో చిరు బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ జ‌ర‌గ‌నున్నాయి. ఈ వేడుక‌కి మెగా హీరోలు అంద‌రు హాజ‌ర‌వుతారు. అయితే కొన్నాళ్ళుగా చిరు బ‌ర్త్‌డే వేడుక‌ల‌కి దూరంగా ఉన్న ప‌వ‌న్ ఈ సారి మాత్రం త‌ప్ప‌క హాజ‌రు కానున్నాడ‌ట‌. ఆయ‌న‌కి ఇప్ప‌టికే మెగా అభిమానుల నుండి స్పెష‌ల్ ఇన్విటేష‌న్ అంద‌గా, వేడుక‌ల‌లో హాజ‌ర‌య్యేందుకు ప‌వ‌న్ ఆస‌క్తి చూపార‌ట‌. మ‌రి చిరంజీవి హాజ‌ర‌వుతారా లేదా అనే దానిపై కాస్త స‌స్పెన్స్ నెల‌కొంది. మరోవైపు అభిమానులు మెగాస్టార్ పుట్టినరోజు నాడు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌ను చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22) సందర్భంగా రెండు రోజుల ముందుగానే ఆగస్ట్ 20న విడుదల చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా “సైరా” టీజర్ ట్రెండ్ అవుతుంది.

Related posts