telugu navyamedia
andhra news political

జనసేనకు మరో షాక్.. ఆకుల రాజీనామా

akula satyanarayana

జనసేనకు ఆ పార్టీ నుంచి నేతలు ఒకొక్కరిగా పార్టీనీ వీడుతున్నారు. ఇప్పటికే రావెల కిశోర్ బాబు, అద్దేపల్లి శ్రీధర్, డేవిడ్ రాజు, మారంశెట్టి రాఘవయ్య, చింతల పార్థసారథిలు పార్టీకి గుబ్ బై చెప్పారు. తాజాగా జనసేనకు ఆ పార్టీ నేత ఆకుల సత్యనారాయణ రాజీనామా చేశారు.

రాజీనామా లేఖను జనసేనాని పవన్ కల్యాణ్ కు పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో ఆయన పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా పార్టీతో ఆయన అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మరికొందరు నేతలు కూడా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ చేసిన ఆకుల సత్యనారాయణ ఓటమి పాలయ్యారు.

Related posts

మహిళల శాపంతోనే ఆజం ఖాన్ పై కేసులు: జయప్రద

vimala p

నేటి మ్యాచ్ తో .. మరో రికార్డు సాధించిన భారత సారథి కోహ్లీ..

vimala p

సీఎం జగన్ తో మంత్రివర్గ ఉప సంఘం భేటీ

vimala p