• Home
  • వార్తలు
  • రాధాకృష్ణ కాబ‌ట్టే ఇంత రాద్ధాంత‌మా..???
రాజకీయ వార్తలు వార్తలు

రాధాకృష్ణ కాబ‌ట్టే ఇంత రాద్ధాంత‌మా..???

Ram mohan Naidu , Radha Krishna Contraversy (4)
రాజ‌కీయ ప‌రిస్థితులు సున్నితంగా ఉన్న స‌మ‌యంలో నేత‌లే కాదు….ప్ర‌జాభిప్రాయాన్ని ప్ర‌భావితం చేయ‌గ‌ల స్థానంలో ఉన్న ప్ర‌తిఒక్క‌రూ ఆచితూచి మాట్లాడాలి. ముఖ్యంగా ప్ర‌జ‌ల‌కు, పాల‌కుల‌కు మ‌ధ్య సంధాన‌క‌ర్త‌లుగా వ్య‌వ‌హ‌రించే మీడియా వ్య‌క్తులు ప‌రిధులు దాటి మాట్లాడ‌కూడ‌దు. ఏ ఉద్దేశంతో వ్యాఖ్య‌లు చేసినా…అస‌లు మాట‌లు వెన‌క ఏ ఉద్దేశ‌మూ లేక‌పోయినా..ఎన్నిక‌ల ఏడాది..ప్ర‌తీదీ రాజ‌కీయ అంశంగానే మారిపోతుంది. ఇక పాల‌క పక్షానికి అనుకూలమ‌న్న ముద్ర వేయించుకున్న ప‌త్రికాధిప‌తి నోటి నుంచి వ‌చ్చిన వివాదాస్ప‌ద మాట‌ల‌యితే..ఉద్య‌మాల దాకా వ్య‌వ‌హారం వెళ్తుంది. ప్ర‌స్తుతం ఉత్త‌రాంధ్ర‌లో జ‌రుగుతోంది ఇదే. త‌న మార్క్ ఇంట‌ర్వ్యూ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో భాగంగా ఆంధ్ర‌జ్యోతి, ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహ‌న్ నాయుడిని ఇంట‌ర్వ్యూ చేస్తున్న క్ర‌మంలో అనుకోని విధంగా ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన ఓ వివాదాస్ప‌ద మాట…త‌ద‌నంత‌ర ప‌రిణామాలు ఏపీలో రాజ‌కీయాలు ఎంత సున్నితంగా ఉన్నాయో తెలియ‌జేస్తున్నాయి. టీడీపీ కేంద్ర‌ప్ర‌భుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా రామ్మోహ‌న్ నాయుడు లోక్ స‌భ‌లో హిందీలో చేసిన అన‌ర్గ‌ళ ప్ర‌సంగంపై అన్ని వ‌ర్గాల నుంచీ ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. స‌హ‌జంగానే రామ్మోహ‌న్ నాయుడు ఇంట‌ర్వ్యూలో రాధాకృష్ణ ఆ అంశాన్ని ప్ర‌స్తావించారు.
Ram mohan Naidu , Radha Krishna Contraversy (4)
నిజానికి రాధాకృష్ణే కాదు…ఆ ప్రసంగం త‌ర్వాత  రామ్మోహ‌న్ నాయుడిని ఇంట‌ర్వ్యూ చేసిన వాళ్లంద‌రూ ఆయ‌న మాట్లాడిన తీరును ప్ర‌శంసించారు. హిందీ అంత ప‌రిచ‌యం లేని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రాంతానికి చెంది ఉండి… ఉత్త‌రాది నాయ‌కుడిలా ఎలా మాట్లాడ‌గ‌లిగార‌ని కూడా రామ్మోహ‌న్ నాయుడిని ప‌లువురు ప్ర‌శ్నించారు. ఢిల్లీలో చ‌దువుకోవ‌డం, కాలేజీలోని స్నేహితుల ప్ర‌భావం, హిందీ భాష‌పై ఉన్న ఇష్టంతోటి భాష నేర్చుకున్నాన‌ని రామ్మోహ‌న్ నాయుడు చాలా ఇంట‌ర్వ్యూల్లో వివ‌రించారు. అలాగే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లోనూ ఈ అంశం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఉత్త‌రాంధ్ర‌లో పుట్టి పెరిగి ఇంతా బాగా హిందీ ఎలా నేర్చుకున్నావ‌ని అడిగే క్ర‌మంలో రాధాకృష్ణ త‌న శైలిలో పొట్ట‌కోస్తే హిందీ అక్ష‌రం ముక్క‌రాదు క‌దా ఉత్త‌రాంధ్ర వాళ్ల‌కు…మ‌రి నీకు అంత బాగా ఎలా వ‌చ్చింది హిందీ అని ప్ర‌శ్నించారు. నిజానికి కోట్లాదిమంది వీక్షించే ఆ కార్య‌క్ర‌మంలో ఇలాంటి మాట‌లు ఎవ‌రూ మాట్లాడ‌కూదు. రాధాకృష్ణ స్థాయి వ్య‌క్తులు అలాంటి ప‌దాలు అస‌లే వాడ‌కూడ‌దు. కానీ ఇంట‌ర్వ్యూ స‌హ‌జ‌సిద్ధంగా ఉండేందుకు రాధాకృష్ణ సాధార‌ణ‌ జ‌నాలు మాట్లాడుకునే మాట‌లు చాలా వాడుతుంటారు. గ‌తంలోని అనేక ఇంట‌ర్వ్యూల్లో కూడా ఆయ‌న ఇలా ప్ర‌జ‌ల వాడుక మాట‌ల‌ను ఉప‌యోగించారు కూడా.  ఆ క్ర‌మంలోనే రామ్మోహ‌న్ నాయుడును పొట్టకోస్తే హిందీ అక్ష‌ర‌ముక్క రాదు క‌దా..మీ ఉత్త‌రాంధ్ర‌వాళ్ల‌కు అని వ్యాఖ్యానించారు. నిజానికి ఇది కోస్తాంధ్ర‌లో బాగా వాడుక‌లో ఉండేమాట. చ‌దువుకోకుండా ఆట‌లు, పాట‌లుతో కాలం గ‌డిపే పిల్ల‌ల‌ను స‌ర‌దాగా మంద‌లించ‌డానికి పెద్ద‌వాళ్లు త‌ర‌చుగా పొట్ట‌కోస్తే అక్ష‌ర‌మ్ముక్క‌రాదు…అని అంటుంటారు. అలాగే చ‌దువు సంధ్యలు లేక‌పోయినా ఉన్న‌త‌స్థానానికి వెళ్లిన‌వాళ్ల గురించి చెప్పే క్ర‌మంలోనూ పొట్ట‌కోస్తే అక్ష‌ర‌మ్ముక్క రాక‌పోయినా బాగా సంపాదించార‌నో, పేరు ప్రఖ్యాతులు సాధించార‌నో అంటుంటారు.
Ram mohan Naidu , Radha Krishna Contraversy (4)
కాక‌పోతే వాళ్లు హిందీఅక్ష‌రం అన్న మాట వాడ‌రు. ఉత్త అక్ష‌రం అని మాత్ర‌మే ప్ర‌యోగిస్తారు. ఆంధ్ర‌ప్రాంత‌వాసులు ఎక్కువ‌గా ఉండే నిజామాబాద్ జిల్లాకు చెందిన రాధాకృష్ణ కూడా ఆ సామెత‌నే ప్ర‌యోగించ‌బోయి తప్పుగా మాట్లాడారు. నిజానికి ఆయ‌న మాట‌ల వెన‌క ఏ దురుద్దేశ‌మూ లేదు, ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌ను, వారి భాష‌ను, యాస‌ను అవ‌మాన‌ప‌ర్చాల‌న్న‌దీ ఆయ‌న అభిమ‌తం కాదు. ప్ర‌శ్న‌లు వాడుక భాష‌లో అడిగే క్ర‌మంలో ఆ ప‌దం ఉప‌యోగించారు. ఈ ఇంట‌ర్వ్యూ సెప్టెంబ‌ర్ 30 వ తేదీన ప్ర‌సార‌మ‌యిన ద‌గ్గ‌ర‌నుంచి సోష‌ల్ మీడియాలో రాధాకృష్ణ‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇది త‌మ ప్రాంతాన్ని అవ‌మానించ‌డ‌మే అని ఉత్త‌రకోస్తా ర‌చ‌యిత‌లు, క‌ళాకారులు, విద్యావేత్త‌లు మండిప‌డుతున్నారు. ఉత్త‌రాంధ్ర ర‌చ‌యిత‌లు, క‌వుల వేదిక ఉర‌క‌వే రాధాకృష్ణ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తోంది. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. త‌మ ప్రాంతాన్ని ఉద్దేశించి అన్నారు కాబ‌ట్టి అక్క‌డి క‌వులు, క‌ళాకారుల‌కు, ప్ర‌జ‌ల‌కు ఆగ్ర‌హం రావ‌డంలో త‌ప్పులేదు. ఈ కోపాన్ని గ‌మ‌నించో, జ‌రిగిన త‌ప్పును గ్ర‌హించో ఆంధ్ర‌జ్యోతి ఖండ‌న ప్ర‌క‌ట‌న కూడా చేసింది. మామూలుగా అయితే వివాదం ఇంత‌టితో ముగిసిపోవాలి. కానీ వివాదం ఇంకా ఇంకా ముదురుతోంది. ఆంధ్ర‌జ్యోతి ప్ర‌చురించిన ఖండ‌న ప్ర‌క‌ట‌న‌పై విమ‌ర్శ‌ల సంగ‌తి ప‌క్క‌న‌పెడితే…ఈ అంశం ఇప్పుడు రాజ‌కీయ రూపు తీసుకోవ‌డ‌మే ఆందోళ‌న‌క‌ర ప‌రిణామం. ఓ ఇంట‌ర్వ్యూలో ఒక ప‌త్రికాధిప‌తి అనుకోకుండా వాడిన మాట‌ల‌ను ప‌ట్టుకుని ఉద్య‌మం చేయాల‌న్న నేత‌ల ఆలోచ‌న ప్ర‌స్తుత రాజ‌కీయాలు ఎంత ప్ర‌మాదక‌ర రీతిలో సాగుతున్న‌యో తెలియ‌జేస్తోంది.Battery autos on subsidi, Janasena
రాధాకృష్ణ వ్యాఖ్య‌ల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్విట్ట‌ర్ లో స్పందించిన తీరు భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌ను క‌ళ్ల‌కు క‌డుతోంది. రాధాకృష్ణ పేరును ప్ర‌స్తావించ‌కుండా ట్విట్ట‌ర్ లో దీనిపై ట్వీట్ చేశారు జ‌న‌సేనాని. భాష‌,యాస‌ల‌ను అగౌర‌వ‌ప‌రిచి, అప‌హాస్యం చేయ‌డం కార‌ణంగానే ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింది. ఈ చ‌ర్య‌లు అక్క‌డి ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీశాయి. ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు అన్ని స‌హ‌జ‌వ‌న‌రులు ఉన్నా వెనుక‌బాటుకు గుర‌వుతున్నారు. నాయ‌కులు అన్ని రంగాల్లో బాగుప‌డుతున్నా ప్ర‌జ‌ల జీవితాలు మాత్రం మార‌డం లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉత్త‌రాంధ్ర భాష‌, యాస‌ల‌ను అప‌హాస్యం చేయ‌డం త‌గ‌దు అని ప‌వ‌న్ ట్వీట్ చేశారు. జ‌న‌సేనాని వ్యాఖ్య‌లు గ‌మ‌నిస్తే…ఈ వివాదాన్ని ఆస‌రాగా చేసుకుని ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టి ఉద్య‌మం లేవ‌దీసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతోంది. ఆయ‌న తెలంగాణ ఉద్యమాన్ని ప్ర‌స్తావించింది ఈ కోణంలోనే. విభ‌జ‌న బాధ‌ల‌కు తోడు కేంద్రం స‌హాయ‌నిరాక‌ర‌ణ‌తో అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రైన‌ది కాదు. ఇప్ప‌టికే ముక్క‌లైన రాష్ట్రంలో త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం మ‌రో ఉద్య‌మం మొద‌లుపెట్టి…మరోసారి విభ‌జ‌న వాదాన్ని తెర‌పైకి తేవ‌డం ఏ మాత్రం హ‌ర్షించ‌ద‌గ్గ,ప‌రిణామం,కాదు.Ram mohan Naidu , Radha Krishna Contraversy (4)
దీని వెన‌క ఎవ‌రున్నా, ఏ ఉద్దేశాలు ఉన్నా ఏపీ ప్ర‌జ‌ల‌కు ఈ వాద‌న ఎంత మాత్ర‌మూ ఆమోద‌యోగ్యం కాదు. అస‌లు ఇలాంటి వాద‌న‌లు తెచ్చే సంద‌ర్భ‌మూ ఇది కాదు. నిజానికి రాధాకృష్ణ మాట్లాడిన మాట‌లు ఆయ‌న కాక వైసీపీ ప‌త్రిక సాక్షికి చెందిన జ‌ర్న‌లిస్టులో, జ‌న‌సేనానికి చెందిన టీవీ చాన‌ళ్ల ప్ర‌తినిధులో మాట్లాడి ఉంటే అవి ఇంత వివాదాస్ప‌ద‌మ‌య్యేవా అన్న‌ది ఓ ప్ర‌శ్న‌. పాల‌క‌ప‌క్షం టీడీపీ ప‌త్రిక‌గా పేరుగాంచిన ఆంధ్ర‌జ్యోతి య‌జమాని కాబ‌ట్టే రాధాకృష్ణ వ్యాఖ్యల‌పై ఇంత చ‌ర్చ జ‌రుగుతోంది. ఎన్నిక‌ల వేళ అధికార‌ప‌క్ష‌మూ, వాటి అనుకూల ప‌త్రిక‌లూ ఎంత జాగ్ర‌త్త‌గా అడుగులు వేయాలో, మాట‌లు ఎలా ఆచితూచి మాట్లాడాలో ఈ వివాదం తెలియ‌జేస్తోంది.
గమనిక: ఈ వీడియో 8 వ నిమిషం వద్ద చుడండి…. 
అదే స‌మ‌యంలో సామాజిక మార్పుకోసం  నినదించే నేత‌లు త‌మ అస‌లు ల‌క్ష్యాల కోసం ఎలాంటి మార్గాలు అనుస‌రించి, రాజ‌కీయాల‌ను ఎలా దిగ‌జారురుస్తారో కూడా అర్ద‌మ‌వుతోంది. 

Related posts

ప్రగతి నివేదన సభకు హైకోర్టు లైన్ క్లియర్

madhu

ఎండీ గా సురేంద్రబాబు బాధ్యతలు స్వీకరణ…

admin

విశాఖలో వై.ఎస్.ఆర్ సీపీ వంచన వ్యతిరేక దీక్ష…

admin

Leave a Comment