ఎన్.ఆర్.ఐ లతో పవన్

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను ఒక్కసారిగా కాక పుట్టించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభ అనంతరం వరస భేటీలు జరపనున్నారు. నిన్న సమావేశం అనంతరం వరుస బేటీలతో బిజీగా ఉన్న పవన్ ఈ రోజు ఎన్.ఆర్.ఐ లతో సమావేశం అయ్యారు. 
 
జనసేన ఆవిర్భావ సభకు దాదాపు 40 మంది ఎన్.ఆర్.ఐ లు హాజరైనట్టు సమాచారం. ఎన్.ఆర్.ఐ వింగ్ తో  సమావేశం సందర్బంగా పార్టీ నిర్మాణం, భవిష్యత్ ప్రణాళికను వివరించినట్టు తెలుస్తుంది. పార్టీ నెట్ వర్కింగ్ లో సహాయపడాలని మాత్రమే ఎన్.ఆర్.ఐ లను కోరానని ఆయన అన్నారు.
 
సమావేశం అనంతరం పవన్ మాట్లాడుతూ ఎన్.ఆర్.ఐ లను పార్టీకి నిధుల బ్యాంక్ గా చూడబోమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్.ఆర్.ఐ ల సహాయం ఎంతో అవసరమని ఆయన అన్నారు. వామపక్షాలతో కూడా సమావేశమవుతానని నిన్నటి సభలో పేర్కొన్న పవన్ కళ్యాణ్, ఎన్.ఆర్.ఐ ల సమావేశం అనంతరం వారితో కూడా వరుస భేటీల జరుపుతారని తెలుస్తుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *