telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

జగన్ ప్రమాణస్వీకారానికి … పవన్ కళ్యాణ్ ..

pavan on jagan oath program

రేపు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్ ఇప్పటికే పలువురు నేతలను ఆహ్వానించారు. ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్, డీఎంకే చీఫ్ స్టాలిన్, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తదితరులను ఆహ్వానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు జగన్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. చంద్రబాబుకు ఫోన్ చేసి ఆహ్వానించిన జగన్ ఆపై పవన్‌కు కూడా ఫోన్ చేసి మాట్లాడారని సమాచారం. జగన్ ఆహ్వానానికి పవన్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

జగన్ ఆహ్వానం మేరకు చంద్రబాబు హాజరయ్యేది, లేనిది టీడీఎల్పీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రేపు మధ్యాహ్నం 12:23 గంటలకు జగన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రమాణ స్వీకారం సందర్భంగా 5 వేల మందితో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Related posts