telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

2014 ఎన్నికలలో నన్ను వాడుకుని .. వదిలేశారు .. : పవన్ కళ్యాణ్

pavan kalyan meeting with alliance in telangana

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన మద్దతు పార్టీలతో నిన్న హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ, చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలు తనను కరివేపాకులా వాడుకుని పక్కన బెట్టాయని వ్యాఖ్యానించారు. నాడు వారి విజయానికి నన్ను ముడి పదార్థంలా వాడుకున్నారు. నన్ను ఎదగనివ్వాలని వారు అనుకోలేదు. ఇక వారి కోసం నేనెందుకు పని చేయాలి. ఎన్నికల్లో విజయం తరువాత నరేంద్ర మోదీని, బీజేపీ నేతలను కలిశాను. వారితో మాట్లాడిన తరువాత నా అవసరం వారికి లేదనిపించింది. ఎవరూ ఈ మాట నాతో అనలేదుగానీ, అక్కడి పరిస్థితి మాత్రం అదే” అని పవన్ వ్యాఖ్యానించారు.

pavan kalyan meeting with alliance in telanganasగత ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీలు పవన్ కల్యాణ్ మద్దతు తీసుకుని ఎన్నికల బరిలోకి దిగగా, ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా కేవలం 5 లక్షల ఓట్లను అదనంగా పొంది, అధికారాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లోనూ తమకు మద్దతివ్వాలని బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తనను కోరాయని, అయినా, తాను మాత్రం వారికి వ్యతిరేకంగా వెళ్లాలని భావించానని చెప్పుకొచ్చారు. దళిత శక్తిగా ఉన్న మాయావతితో ఈ దఫా పొత్తు పెట్టుకున్నామని, లెఫ్ట్ పార్టీలూ తమతో కలిసి వచ్చాయని, మాయావతికి ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు.

Related posts