telugu navyamedia
andhra news political trending

అఖిలపక్షానికి.. స్వయంగా కదిలిన పవన్ కళ్యాణ్…

pavan kalyan attended undavalli meeting

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రత్యేక హోదా నుండి అనేక విభజన హామీలు నెరవేర్చడంలో అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయి. దీనిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలూ తమ ప్రతినిధులను ఈ సమావేశానికి పంపగా, జనసేన తరఫున స్వయంగా పవన్ కల్యాణ్ హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ తరఫున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనంద్‌బాబు, కుటుంబరావులు రాగా, కాంగ్రెస్ తరఫున తులసిరెడ్డి, జస్టిస్ చలమేశ్వర్ తదితరులు హాజరయ్యారు.

సమావేశానికి ముందు నక్కా ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడుతూ, వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు ఇటువంటి సమావేశాలు ఉపయోగపడతాయని, సమావేశానికి హాజరు కావాల్సిన బాధ్యత వైసీపీపై కూడా ఉందని అన్నారు. కానీ, ఆ పార్టీ పారిపోయిందని ఎద్దేవా చేసిన ఆయన, హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ టీడీపీయేనని అన్నారు. విభజన హామీల అమలుపై ప్రభుత్వం చేస్తున్న పోరాటం గురించి ఈ సమావేశంలో తెలియజేస్తామని పేర్కొన్నారు. విభజన తరువాత ఏపీకి పూర్తిగా అన్యాయమే జరిగిందని ఆయన అన్నారు. అయితే టీడీపీ-జనసేన కలిసేందుకు బయట కుదరకపోవడంతో, వారు ఈ సమావేశాన్ని వేదికగా చేసుకున్నట్టుగా కూడా పవన్ స్వయంగా హాజరవటంపై వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజం అనేది భవిష్యతులో తెలియనుంది.

Related posts

ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ..లాయర్ ఆత్మహత్యాయత్నం 

ashok

కేంద్ర బడ్జెట్‌లో విభజన హామీల ఊసే లేదు: గల్లా జయదేవ్‌

ashok

ఆంధ్ర బాగుపడితే తన అసమర్థత తెలిసిపోతుందని కేసీఆర్‌ భయం!

vimala p