telugu navyamedia
andhra political

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా.. మాజీ ఐపీఎస్ .. పవన్ దూకుడు… 

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచాడు. పార్టీ పటిష్టతపై ద్రుష్టి పెట్టిన పవన రాష్ట్రం మొత్తం ఆయా స్థాయి కమిటీలను, నాయకులను నియమిస్తున్నాడు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పవన్ ఈ మేరకు పార్టీ పటిష్టతపై దృష్టిపెట్టినట్టు తెలుస్తుంది. పార్టీలోని వివిధ పదవులను భర్తీ చేస్తూ జోరుమీదున్నారు. ఇప్పటికే వివిధ పార్లమెంటరీ కమిటీలను ఏర్పాటు చేసిన పవన్ తాజాగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయనతో తనకు పదేళ్ల సాన్నిహిత్యం ఉందన్న పవన్ సర్వీస్ ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 1987లో సివిల్స్‌కు సెలక్ట్ అయినప్పటి కంటే ఇప్పుడే చాలా ఆనందంగా ఉందని అన్నారు. పవన్ రోజూ రాత్రి రెండుమూడు గంటల వరకు పని చేస్తుంటారని, అయినా ఆయన ముఖంలో ఎటువంటి అలసట కనిపించడం లేదని, తాము మాత్రం ఊరికనే అలసిపోతున్నామని అన్నారు. కాగా, సీనియర్ జర్నలిస్ట్ పి.హరిప్రసాద్‌ను పవన్ రాజకీయ కార్యదర్శిగా ఎంపిక చేశారు. జ‌న‌సేన ‘ప్రెసిడెంట్స్ సోష‌ల్ వెల్ఫేర్ ప్రోగ్రాం’ చైర్మన్‌గా రాధా మాధవ్‌ నియమితులయ్యారు.

Related posts

భార‌త రాజ్యాంగానికి 70 ఏళ్లు..ఈనెల 26న పార్ల‌మెంట్‌ స‌మావేశం!

vimala p

రెండో దశ పోలింగ్ … నేడే.. 15 కోట్ల మంది ఓటర్లు..

vimala p

అక్షయ తృతీయకు .. దానాలు చేయాలి.. కొనరాదు.. :గురూజీ చాగంటి కోటేశ్వరరావు

vimala p