telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఘనంగా … సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు..

patel birth anniversary celebrations

దేశ వ్యాప్తంగా ఉక్కుమనిషి, దేశ తొలి హోంమంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గుజరాత్‌లోని నర్మదా నది తీరాన గల పటేల్‌ విగ్రహం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున సాంస్క్రతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అలాగే ఢిల్లీలోని ఆయన స్మారకం వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, హోంమంత్రి అమిత్‌ షా నివాళి అర్పించారు.

పటేల్‌ జయంతి సందర్భంగా ఢిల్లీలోని జాతీయ మైదానంలో అమిత్‌ షా సమైక్యత పరుగును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం పటేల్‌ను స్మరించుకున్నారు. ‘సంఘటితత్త్వంతోనే శాంతి, అభివృద్ధి సాధ్యమని నమ్మి 565 గణరాజ్యాలను ఒక్కటి చేసి సువిశాల భారతదేశాన్ని నిర్మించిన ఆధునిక భారతదేశ రూపశిల్పి, ఐక్య భారత నిర్మాత సర్దార్ వల్లభ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆ ఉక్కు మనిషి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు.

Related posts