telugu navyamedia
culture news

కరోనాకు మందు తయారు చేశామని చెప్పలేదు: పతంజలి

patanjali corona kit

ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న కరోనా వైరస్ కు మందు కనిపెట్టామని పతంజలి సంస్థ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘కరోనిల్ కిట్’ పేరుతో మందును మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని వెల్లడించింది. కరోనా పేషెంట్లపై ఈ మెడిసిన్ కు సంబంధించిన ట్రయల్స్ విజయవంతమయ్యాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పతంజలి ప్రకటనతో కలకలం మొదలైంది. పతంజలికి ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ నోటీసు జారీ చేసింది.

తాము కరోనా వైరస్ కు సంబంధించి ఎలాంటి మందును తయారు చేయలేదని ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖకు తెలిపింది. కరోనిల్ కిట్ పేరుతో తాము ఇంత వరకు కమర్షిషల్ గా అమ్మలేదని తెలిపింది. ఈ మందు వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాత్రమే తాము వెల్లడించామని పేర్కొంది. కరోనా వ్యాధిని ఈ మందు నయం చేస్తుందని తాము ఎక్కడా ప్రచారం చేసుకోలేదని చెప్పింది. ఈ మందు ట్రయల్స్ విజయవంతమయ్యాయని మాత్రమే తాము మీడియా సమావేశంలో చెప్పామని స్పష్టం చేసింది.

Related posts

సోమవారం నుంచి కశ్మీర్‌లో మొబైల్‌ సేవలు!

vimala p

కరోనా పోరుకు గ‌వాస్క‌ర్ రూ. 59 ల‌క్ష‌ల విరాళం!

vimala p

25 ఐదేళ్ళ యువతి తల్లిదండ్రులకు షాక్… డిఎన్ఏలో ఐదుగురు తండ్రులు

vimala p