telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

విమానంలో బాత్రూములో ఆ యువకుడు చేసిన పనికి…!

PLane

అబుదాబి నుంచి ముంబై వెళ్తున్న విమానంలోని ప్రయాణికులను హడలెత్తించాడు ఓ యువకుడు. వివరాల్లోకి వెళ్తే… తుషార్ చౌదరి అనే 27 ఏళ్ల యువకుడు విమానంలో టాయిలెట్‌కు వెళ్లి సిగరెట్ తాగాడు. దీంతో విమానంలో అలారం ఒక్కసారిగా మోగింది. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది టాయిలెట్‌ వైపు పరుగులు తీశారు. మరోవైపు ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు భయపడ్డారు. టాయిలెట్ తలుపు తట్టినా తుషార్ ఎంతకీ తలుపు తీయకపోవడంతో మరో తాళం సాయంతో సిబ్బంది తలుపు తెరిచారు. లోపల తుషార్ సిగరెట్ కాలుస్తూ కనిపించాడు. విమానం ముంబైలో ల్యాండయ్యాక సిబ్బంది ఫిర్యాదు మేరకు తుషార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related posts