telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యాసిడ్ బాధితురాలిగా దక్షిణాది హీరోయిన్… దీపికా కంటే ముందే…!

Parvathy

యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ యదార్థ జీవితకథ ఆధారంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనే నటించిన చిత్రం “ఛపాక్”. మేఘనా గుల్జార్ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో యాసిడ్ బాధితురాలిగా దీపిక కనిపించింది. తాజాగా విడుదలైన ట్రైలర్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రస్తుతం “ఛపాక్” టీం ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆమె యాసిడ్ బాధితురాలిగా కనిపించారు. యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. అయితే దీపిక కన్నా ముందు ఒక దక్షిణాది నటి యాసిడ్ బాధితురాలి పాత్ర పోషించారు. అయితే ఆమెకు దీపికకు లభించింత ఆదరణ లభించలేదు. ఆ నటిపేరు పార్వతి థిరువేథు. ఆమె యాసిడ్ బాధితురాలిగా నటించిన సినిమా పేరు “ఉయారే”. బాలీవుడ్ సినిమా “ఛపాక్” ట్రైలర్ విడుదలైన నేపధ్యంలో పార్వతి థిరువేథు వార్తల్లోకి వచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో పార్వతి థిరువేథు నటనను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. 1988 ఏప్రిల్‌లో జన్మించిన పార్వతి థిరువేథు మలయాళ, తమిళ, కన్నడ సినిమాలలో నటించారు. పార్వతి థిరువేథు తొలిసారిగా మలయాళంలో ‘అవుట్ ఆఫ్ సెలబ్స్’లో నటించారు.

Related posts