telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“అర్జున్ రెడ్డి”పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు… విజయ్ దేవరకొండ ముందే…!

Arjun-Reddy

రౌడీ బాయ్ విజయ్ దేవర‌కొండను స్టార్ హీరోను చేసిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. ఈ సినిమాను ఇప్పటివరకు రెండు భాషల్లో రీమేక్ చేస్తారు. రెండు రీమేక్‌లు బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాయి. కానీ అర్జున్ రెడ్డి, దీనికి హిందీ వెర్షన్ అయిన ‘కబీర్ సింగ్’ సినిమాలను ఎన్ని వివదాలు చుట్టుముట్టాయో అందరికీ తెలిసిందే. అయితే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలపై ప్రముఖ మలయాళ నటి పార్వతి షాకింగ్ కామెంట్స్ చేశారు. అదికూడా విజయ్ దేవరకొండ ఎదురుగానే ఉండగా. ఇలాంటి సినిమాల్లో తనకు అవకాశం వస్తే తాను అస్సలు నటించనని తెలిపారు. “ఓ ట్రాజెడీ సినిమాను చూశాక కాసేపు బాధపడి మర్చిపోతాం. కానీ కబీర్ సింగ్ లాంటి సినిమాలో ఓ హీరో హీరోయిన్‌ను కొట్టిన సినిమాకు అబ్బాయిలు యూట్యూబ్‌లో చేసిన కామెంట్స్ చూసి షాకయ్యాను. సామాజిక బాధ్యత లేకుండా ఇలాంటి సినిమాలు చేసే హీరోలకు నేను దూరంగా ఉంటాను. యవతపై చెడు ప్రభావం చూపే సినిమాలు అస్సలు చేయను” అని తెలిపారు. పార్వతి మాటలకు విజయ్ దీటుగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. “కేవలం ఒక సినిమాను బట్టి వ్యక్తి క్యారెక్టర్‌ ఉండదు. మన కుటుంబం, మనం చదువుకున్న స్కూల్, తల్లిదండ్రులు మనల్ని పెంచిన తీరుపై ఆధారపడి ఉంటుంది. నేను నటించే సినిమా వివాదాస్పదం అయినా కూడా నాకు కాన్సెప్ట్ నచ్చితే తప్పకుండా నటిస్తాను. అయితే ఒక్కోసారి పార్వతి లాజిక్‌తో నేను కూడా ఏకీభవిస్తాను. సమాజానికి హాని కలిగించే కాన్సెప్ట్స్‌కు దూరంగా ఉంటాను” అని తెలిపారు.

కబీర్ సింగ్ సినిమాలో హీరో హీరోయిన్‌ని కొట్టడం యువతను ప్రేరేపించే విధంగా ఉందని ఓసారి సమంత అన్నారు. ఇలాంటి కాన్సెప్ట్స్‌ను సపోర్ట్ చేయనని అన్నారు. కానీ గత నెలలో విడుదలైన ప్రముఖ హాలీవుడ్ చిత్రం ‘జోకర్’ మాత్రం పిచ్చిగా నచ్చిందని సమంత అభిప్రాయపడ్డారు. జోకర్ సినిమాలో కబీర్ సింగ్, అర్జున్ రెడ్డి కంటే ఎక్కువ వైలెన్స్ ఉంటుంది. హీరో ఏకంగా తన దారికి అడ్డు వచ్చిన వారందరినీ చంపేస్తారు. మరి ఈ సినిమా సమంతకు ఎలా నచ్చిందని పలువురు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

Related posts