telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఎంపీఎల్‌తోనే అది సాధ్యమవుతుంది : బీసీసీఐ

లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనాల మధ్య వివాదాల్లో భాగంగా బాయ్ కాట్ చైనా నినాదం వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో బీసీసీఐ చైనా మొబైల్ కంసెనీ వివోను ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుంచి తొలగించింది. ఆ తరువాత స్పాన్సర్ కోసం బిడ్డింగ్ దాఖలు చేసింది. అందులో ఎంపీఎల్ రూ.220 కోట్లకు ఆ బిడ్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎంపీఎల్ అదే తరహాలో బీసీసీఐతో మరో ఒప్పందం చేసుకుంది. మూడు సంవత్సరాల పాటు భారత జట్టుకు క్రికెట్ కిట్‌లు అందించేందుకు ఒప్పందం చేసుంకుంది. దీనికి గానూ సంవత్సరానికి కోట్ల రూపాయలను ఇచ్చేందుకు ఈ సంస్థ ఒప్పుకుంది. అయితే ఈ ఒప్పందం నవంబరు నుంచే ప్రారంభం అవుతుంది. అంటే ఇండియా-ఆస్ట్రేలియాల మధ్య జరగబోయే సరీస్‌కు మొబైల్ ప్రీమియ్ లీగ్ తన కిట్‌లను అందించనుంది. అయితే దీనిపై బీసీసీఐ అధికారి మాట్లాడారు. ‘ఈ ఒప్పందాలు భారత జట్టుకు ఓ కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఇటువంటి సరికొత్త సంస్థతో పనిచేసేందుకు మేము చూస్తున్నాం. భారత్ జట్టు భవితకు ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈసారి జర్సీతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా అభిమానులను ఆకట్టుకుంటామ’ని అధికారులు తెలిపారు. అంతేకాకుండా సీనియర్ మెన్, మహిళలు, అండర్-19 జట్లన్ని ఈ ఒప్పందంలో భాగమేనని తెలిపారు.

Related posts