telugu navyamedia
news political Telangana trending VOTE

రేపు లెక్కింపు.. నేడే భేటీల పర్వం…

telangana reservations for panchayat

ఎన్నికల ముందు ఎవరు ఎవరితో ఉంటారో ఉహించడం కాస్త కష్టం… కానీ ఎన్నికల తరువాత కూడా ఇదే పరిస్థితి ఉండేట్టుగా ఉంది, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే. తాజాగా ముగిసిన తెలంగాణ ఎన్నికల ముందు ఎంఐఎం లాంటి పార్టీలు ఎటువైపు మొగ్గు చూపేది స్పష్టత లేకుండా చాలా తెలివిగా ప్రచారం చేసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్ని తెరాస గెలుపు ఖాయం అని చూపుతుండటం, రేపు ఓట్ల లెక్కింపు కావడంతో నేడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, కేసీఆర్ తో భేటీ కానున్నారు. మరోవైపు ప్రజా కూటమి కూడా నేడు భేటీ అయ్యి, లెక్కింపు.. ఓట్ల సరళిని గురించి మరోసారి చర్చించనున్నారు.

అసదుద్దీన్ స్వయంగా కేసీఆర్ కు కాల్ చేసి, మీ వ్యూహం ఫలించింది. కూటమిని మట్టికరిపించారు, మళ్ళీ మీరే ముఖ్యమంత్రి అంటూ అభినందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కూడా సహకరించినందుకు, అసదుద్దీన్ కు కృతఙ్ఞతలు తెలిపారు. నేడు వీరిద్దరూ భేటీ అయ్యి పలు విషయంపై చర్చించనున్నారు.

Related posts

గన్‌మెన్‌లు బయటకు వెళ్లాలని అఖిలప్రియ ఆగ్రహం!

vimala p

టీడీపీ నేత ఇంటిని .. వేలం వేసేస్తున్న బ్యాంకు! బాకీ కింద జమ.. !

vimala p

కొత్త కోడలికి.. 300 కోట్ల నగ ఇచ్చిన నీతా అంబానీ ..

vimala p