telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఫ్యాక్షనిజాన్ని వదిలేశాం.. మళ్ళీ రెచ్చగొట్టొద్దు .. : పరిటాల సునీత

Sriram to contest from Raptahdu

నిన్న ఎన్నికల సందర్భంగా ఏపీలో పలు చోట్ల టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. పలు చోట్లు హింస చోటు చేసుకుంది. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో సైతం దాడులు జరిగాయి. టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ను వైసీసీ శ్రేణులు అడ్డుకున్నాయి. వారి వాహనాలపై రాళ్లు రువ్వాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీకి పరిటాల సునీత ఫిర్యాదు చేశారు.

ఆమె మాట్లాడుతూ, వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ కు హెచ్చరిక జారీ చేశారు. ‘ప్రకాశ్ రెడ్డీ, మీకు నేను ఒకటే చెబుతున్నా. 14 ఏళ్ల క్రితమే మేము ఫ్యాక్షన్ వదిలేశాం. శాంతియుతంగా ఉన్నాం. నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఫ్యాక్షన్ ను ప్రారంభించేందుకు ప్రయత్నించవద్దు. మాపై దాడులకు ఉసిగొల్పడం మానుకోండి’ అని వ్యాఖ్యానించారు.

Related posts