వార్తలు సామాజిక సినిమా వార్తలు

పరిసర పరిష్వంగం

parisara parishwangam poetry corner

“మన్ను వెన్ను చీల్చుకొని
ప్రాణవాయు దాత విత్తై మొలకెత్తుతుంది!
నింగి నుదిటిిన స్వచ్ఛత కిరణం వెలుగు దూతై పలకరిస్తుంది!
పుడమి ఒడిలో జలనిధి
జీవపు గర్భమై నీళ్లాడుతుంది!
ఆహ్లాద అధరాల మధువులు నింపుకొని కుసుమ వనం చైత్రమై వికసిస్తుంది!
స్నేహ హస్తాల “స్వస్థతల్ని”పూసుకుని
పరిసరాలు నిత్యం పహారా కాస్తుంటాయి!
అలసిన మనసుల్ని పరామర్శిస్తుంటాయి!
“అమ్మ ఆర్ద్రతల్ని” స్ఫురణకు తెస్తాయి!
ప్రకృతి ఆజ్ఞల పాదాల వెనుక పసితనాలై ప్రాణులన్నీ పయనిస్తాయి!
కల్మష మతుల నరజాతి మాత్రం
వానర సంతతై….
కాలుష్య సంత వీధుల్లో
“పరిశుభ్రతను”  ఆరేసి,….
మాలిన్యాల కసుపును
“పసుపు పచ్చని”  పర్యావరణానికి పూసి…..
“ఆరోగ్య భాగ్యాన్ని”
వ్యాధుల వార్డుల్లో 
బంధిస్తున్నది!
నిర్లక్ష్య వాకిలిలో ఒరిిగిన
శుష్క దేహాన్ని కాసుల పగ్గాలు వేసి కాసుకోవాలని చూడక….
నిస్వార్ధపు ప్రేమను పంచేందుకు కరాలు చాచిన 
వెచ్చని పరిసర పరిష్వంగంలో “పచ్చని తరువుల తనువులై” ఒదిగిపోదాం ఇకనైనా!”

 

– డి.నాగజ్యోతిశేఖర్,
మురమళ్ళ.

Related posts

“అరవింద సమేత” పై మెగా ఫ్యామిలీ పొగడ్తల వర్షం..

jithu j

బాలాంత్రపు రజినీకాంతారావు ఇక లేరు

admin

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘’మాగ్నెట్’’ చిత్రం

jithu j

Leave a Comment