రాజకీయ వార్తలు సామాజిక

పెరుగుతున్న సీనే నది నీటి మట్టం… ఆందోళనలో ప్యారిస్ ప్రజలు….

ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ను వరద ముంచెత్తవచ్చని సూచనలు చేస్తున్నారు ఫ్రాన్స్ వాతావరణ శాఖ అధికారులు. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో సీనే నది పారిస్ నగరం గుండా ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. సీనే నది నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీంతో అక్కడి అధికారులు స్థానికులను అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదొస్తే ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని రోడ్లను ముందుజాగ్రత్తగా మూసివేశారు.

ప్యారిస్ అధికారులు మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురవడం కారణంగానే వరద ముప్పు వాటిల్లిందని, సగటు వర్షపాతం మాములుగా కన్నా ఈ ఏడాది రెండు రెట్లు అధికంగా నమోదైందని, మంగళవారం నది ఉప్పొంగి రోడ్ల మీదకు వచ్చే అవకాశమున్నట్టు భావిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా వరద తీవ్రత ఎక్కువగా ఉంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘లోవ్రో’ మ్యూజియంలోకి కూడా నీరు వెళ్తుందని చెబుతున్నారు అధికారులు.

Related posts

పోలీసులు నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి… కన్నవారే హంతకులు

nagaraj chanti

కర్ణాటకలో ఓట్లకు కాసుల వర్షం

admin

అందుకే కనకమేడల ఎంపిక

admin

Leave a Comment