telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విదేశాలలో కూడా .. రైతుల నిరసనలు .. వినూత్నంగా..

paris farmers protest with tractors on roads

ప్రపంచవ్యాప్తంగా రైతులలో సహనం నశించినట్టే ఉంది. అందుకే చాలా చోట్ల వాళ్ళు నిరసనల బాట పడుతున్నారు. ఇప్పటివరకు భారతదేశంలో ఇలాంటి నిరసనలు సహజంగా చూస్తూనే ఉన్నాం. అయితే పారీస్ లో కూడా రైతులు విన్నూత్న రీతిలో సమ్మెకు దిగారు. రైతులు తమ సమస్యల గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరసన చేపట్టారు. ట్రాక్టర్లలని కలిగిన చాలా మంది రైతులు తమ వాహనాలతో రాజధాని పారిస్ లోకి ప్రవేశించి నిరసన తెలిపారు. దీనితో రోడ్లన్నీ ట్రాక్టర్లతో నిండిపోయాయి. సుమారు 10వేల ట్రాక్టర్లు ఒక్కసారిగా రోడ్డు పైకి ఎక్కడంతో అక్కడి ప్రాంతం మొత్తం ట్రాఫిక్ కారణంగా స్తంభించిపోయింది.

తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించేవరకు ఇదే తరహాలో నిరసన చేపడతామని, వాహనాలను ఇక్కడి నుండి కదిలించే ప్రసక్తే లేదని రైతులు పేర్కొంటున్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఎలిస్ ఆరోపించారు. ఇదిలావుండగా జర్మనీ ప్రభుత్వ వ్యవసాయ విధానాలను నిరసిస్తూ 10,000 మంది రైతులు 5,000 ట్రాక్టర్లను బెర్లిన్‌ రోడ్లపైకి తీసుకువచ్చి నిరసన తెలిపారు. దీనిపై కొత్త ఈయూ కమిషన్ అధ్యక్షుడు బుధవారం స్పందించారు. వ్యవసాయ వృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని మాటిచ్చారు.

Related posts