telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తల్లిదండ్రులు స్కూల్ ఫీజులు చెల్లించాలి!

school students

హై కోర్టు తీర్పు ప్రకారం తల్లిదండ్రులు విధిగా పాతబకాయిలు, ఈ సంవత్సరం ఫీజులు చెల్లించి పాఠశాలలను, ఉపాధ్యాయులను ఆదుకోవాలని ట్రస్మ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు ఓ పత్రిక ప్రకటనలో కోరారు.గత మార్చి నెల నుండి పాఠశాలలు పూర్తిగా లాక్ డౌన్ లో ఉండడం వల్ల యాజమాన్యాలు, బోధన మరియు బోధనేతర సిబ్బంది అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు.

ముఖ్యమంత్రి గారు లాక్ డౌన్ సమయంలో ఫీజులు వసూలు చేయవద్దని చేస్తే 100 డయల్ చేయమని చెప్పడం జరిగింది. విద్యా సంవత్సరం 2020-21 కి తల్లిదండ్రుల నుండి నెల వారిగా ఫీజులు వసూలు చేయాలని జీ ఓ నెం.46 ని విడుదల చేసారు.

దాంతో తల్లిదండ్రులు పాఠశాలలకు 2019-20 విద్యాసంవత్సరం పాత బకాయిలు చెల్లించడం లేదు. దాంతో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు జీవన చిత్రం అస్తవ్యస్తంగా మారింది. తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్యాల సంఘం( ట్రస్మా ) రాష్ట్ర కమిటీ పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తమను, సిబ్బందిని ఆదుకోవాలని అభ్యర్థించారు. కానీ ప్రభుత్వాల నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో విధిలేక జూలై నెలలో కోర్టును ఆశ్రయించారు. సుమారుగా మూడు నెలలు విచారణ జరిపిన మీదట తల్లిదండ్రులు పాత బకాయిల చెల్లించాలని, ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులు నెలవారిగా చెల్లించాలని WP No. 14127/2020, తేదీ 25.09.2020 ద్వారా కోర్టు తీర్పు వెలువరించిందని తెలిపారు.

Related posts