telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సెషన్ 3లో పారానార్మల్ ఎక్స్‌పర్ట్‌ స్టీవ్ తో సుశాంత్ ఆత్మ ఏం చెప్పిందంటే ?

Sushanth singh rajput

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సుశాంత్ ది ఖచ్చితంగా హత్యేనని భావిస్తున్నారు ఆయన అభిమానులు. కాగా పారానార్మల్ ఎక్స్‌పర్ట్‌ స్టీవ్ హాఫ్ సుశాంత్ ఆత్మతో చేసిన రెండు స్పిరిట్ సెషన్స్ ద్వారా.. సుశాంత్ అభిమానులు అసలు ఏం జరిగి ఉంటుందన్న దానిపై ఓ క్లారిటీకి వస్తున్నారు. ఇక ఈ స్పిరిట్ సెషన్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టిస్తున్నారు. అటు సుశాంత్ ఆత్మతో మాట్లాడటానికి స్టీవ్ మరో రెండు సెషన్లు చేశారు. రెండవ సెషన్‌లో, సుశాంత్ ఆత్మ ”Big Arguments With Men” అని చెబుతుంది. అంతేకాకుండా మీరు చనిపోయే ముందు రోజు ఏమి జరిగిందని స్టీవ్ అడిగినప్పుడు.. ”they bought nails” అని సుశాంత్ ఆత్మ పేర్కొంటుంది. అలాగే తన మరణం వెనుక ఉన్నవారికి అండగా బడా వ్యక్తులు ఉన్నారని సుశాంత్ ఆత్మ పేర్కొంటుంది. ఇప్పుడు తాజా మరో సెషన్‌తో స్టీవ్ ముందుకు వచ్చాడు. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో స్టీవ్ ”చాలామంది మీ ఫ్యాన్స్ మీరు హత్య చేయబడ్డారని అనుకుంటున్నారు. దానికి ఏం చెబుతారు” అని అడిగినప్పుడు.. సుశాంత్ ఆత్మ ” ???… The Neck” అని సూచిస్తుంది. ఇక తాను ఒంటరిగా లేనని.. తన తల్లి తనతో ఉన్నానని” I Got Wings” అని సుశాంత్ వెల్లడిస్తారు. ఈ వీడియోను మీరు కూడా చూడండి.

Related posts