telugu navyamedia
రాజకీయ వార్తలు

భర్త వ్యాఖ్యల పై స్పందించిన నిర్మలా సీతారామన్

nirmala sitharaman

దేశ ఆర్థిక వృద్ధి రేటుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను తప్పుపడుతూ దేశ ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోందని గణాంకాలు కూడా స్పష్టం చేస్తున్నాయని… కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం దీన్ని ఒప్పుకోవడం లేదని ఆయన విమర్శించారు. మన ఆర్థిక పరిస్థితి మళ్లీ గాడిలో పడాలంటే… పీవీ నరసింహారావు-మన్మోహన్ సింగ్ ల ఎకనామిక్ మోడల్ ను అనుసరించాలని సూచించారు. ‘ది హిందూ’ పత్రికకు రాసిన ఓ ఆర్టికల్ లో ఆయన ఈ మేరకు తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

ఈ నేపథ్యంలో భర్త ప్రభాకర్ చేసిన విమర్శలపై నిర్మలా సీతారామన్ స్పందించారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సంస్థాగత సంస్కరణలను చేపట్టిందని ఆమె తెలిపారు. జీఎస్టీ, వంట గ్యాస్, ఆధార్ తదితర అంశాలకు సంబంధించి తాము ఎన్నో చేశామని, ఇవన్నీ దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరిచేవే అని చెప్పారు. జీఎస్టీని కాంగ్రెస్ పార్టీ తీసుకురాలేదని గుర్తు చేశారు. ఉజ్వల పథకంతో 8 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారని అన్నారు. పన్నులకు సంబంధించి ఎన్నో సంస్కరణలు చేశామని చెప్పారు.

Related posts