వార్తలు సినిమా వార్తలు

పేప‌ర్ బాయ్ సెన్సార్ పూర్తి…

Mahesh and Prabhas about Paperboy Movie promotions
సంతోష్ శోభ‌న్ హీరోగా తెర‌కెక్కిన పేపర్ బాయ్ ఆగ‌స్ట్ 31న విడుద‌ల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. క్లీన్ యు స‌ర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు. పేప‌ర్ బాయ్ లో సంతోష్ శోభ‌న్ కు జోడీగా రియా సుమ‌న్, తాన్యా హోప్ న‌టించారు. జ‌య శంక‌ర్ ఈ చిత్రాన్ని రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే విడుద‌లైన పేప‌ర్ బాయ్ ట్రైల‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. మిలియ‌న్ వ్యూస్ కూడా దాటింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ఈ చిత్రానికి క‌థ ఇవ్వ‌డ‌మే కాకుండా త‌న సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ పై నిర్మించారు. 
 
న‌టీన‌టులు:
సంతోష్ శోభ‌న్, రియా సుమ‌న్, తాన్యాహోప్, పోసాని కృష్ణ‌మురళి, అభిషేక్ మ‌హ‌ర్షి, విద్యాల్లేక రామ‌న్, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, బిత్తిరి స‌త్తి, స‌న్నీ, మ‌హేశ్ విట్ట త‌దిత‌రులు
 
సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌కుడు: జ‌య‌శంక‌ర్
నిర్మాత‌లు: స‌ంప‌త్ నంది, రాములు, వెంక‌ట్ మ‌రియు న‌ర‌సింహా
నిర్మాణ సంస్థ‌లు: స‌ంపత్ నంది టీమ్ వ‌ర్క్స్, బిఎల్ఎన్ సినిమా మ‌రియు ప్ర‌చిత్ర క్రియేష‌న్స్
సంగీతం: భీమ్స్ సిసిరేలియో
సినిమాటోగ్ర‌ఫీ: సౌంద‌ర్ రాజ‌న్ 
ఎడిట‌ర్: త‌మ్మిరాజు
ఆర్ట్ డైరెక్ట‌ర్: రాజీవ్
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ముర‌ళి మామిళ్ళ‌
స్క్రిప్ట్ కో ఆర్డినేట‌ర్: సుధాక‌ర్ పావులూరి
పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

 

Related posts

ఆయన..సీఎం సీఎం అనుకుంటూ పుట్టాడు : జేసీ

admin

మమ్మల్ని దత్తత తీసుకోండి…మీకు ఆక్సిజన్ ఇస్తాము…

chandra sekkhar

బాబర్‌ క్యాచ్‌కు సోషల్‌ మీడియా ఫిదా… సూపర్‌ మ్యాన్‌ ‘ అజమ్‌’ అంటూ ప్రశంసలు

jithu j

Leave a Comment