telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

డయాబెటిస్ వలన హృద్రోగాలు.. బొప్పాయితో వాటికీ చెక్.. !

papaya for diabetic heart diseases

పండ్లు సహజంగా శరీరానికి చాలా మేలు చేస్తాయని అందరికి తెలిసిందే. అయితే అందులో కొన్ని అందరూ తీసుకోదగినవి ఉన్నాయి. అందులో బొప్పాయి చెప్పుకోదగ్గది. ఇది తీసుకోవడం వెనుక ఉన్న కారణం, డయాబెటిస్‌ వల్ల వచ్చే హృద్రోగాల్ని తగ్గిస్తుంది.

ఎముకల పరిపుష్టికి బొప్పాయిలోని విటమిన్‌-కె ఎంతో తోడ్పడుతుంది. ఇది శరీరం కాల్షియంను పీల్చుకునేలా చేయడంతో ఎముకలు బలంగా ఉంటాయి. ఆర్థరైటిస్‌నీ నిరోధిస్తుంది. రోజూ బొప్పాయి తినేవాళ్లలో కీళ్లనొప్పులు రావు.

నెలసరి క్రమంగా రానివాళ్లలో పచ్చిబొప్పాయి తిన్నా, రసం తాగినా అది సరై పోతుంది. బొప్పాయి శరీరంలో వేడిని పుట్టిస్తుంది కాబట్టి ఇది ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా నెలసరిని క్రమబద్ధీకరిస్తుంది.

బొప్పాయిని రోజూ తినడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. కొవ్వు పదార్థాల వల్ల ఏర్పడే సమస్యల నుంచి బయటపడటమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది.

అలసట, అనారోగ్య సమస్యలను బొప్పాయి తొలగిస్తుంది. క్యాన్సర్‌ నివారణలో కూడా బొప్పాయి చాలా ఉపయోగకారి. ఇందులో బిటాకెరోటిన్‌, లూటిన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయి.
papaya and its benefits
బొప్పాయి తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉండటంతో పాటు కంటి సమస్యలను తీరుస్తుంది. నారింజ, యాపిల్‌ కంటే బొప్పాయిలో విటమిన్‌ ఇ చాలా అధికంగా ఉంటుంది.

చర్మం పొర చాలా సున్నితంగా, మృదువుగా మారడానికి బొప్పాయి జ్యూస్‌ సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Related posts