telugu navyamedia
political telugu cinema news trending

ప్రముఖ సింగర్ .. బీజేపీలోకి …

panjab singer daler mehandi into bjp

రోజురోజుకు బీజేపీలో చేరుతున్న సెలెబ్రిటీల సంఖ్య పెరుగుతోంది. తాజాగా, ఆ పార్టీలో మరో సెలెబ్రిటీ చేరారు. పంజాబ్ కు చెందిన ప్రముఖ గాయకుడు దలేర్ మెహంది బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి విజయ్ గోయల్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి సమక్షంలో పార్టీ కండువాను దలేర్ మెహంది కప్పుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు దలేర్ కు అభినందనలు తెలిపారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన తనకు లేదని అన్నారు.

ఢిల్లీ వాయవ్య బీజేపీ అభ్యర్థి, ప్రముఖ గాయకుడు హన్స్ రాజ్ హన్స్ తరపున ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు. దలేర్ కు హన్స్ కు మధ్య బంధుత్వం ఉంది. హన్స్ కుమారుడితో దలేర్ మెహంది కుమార్తె వివాహం జరిగింది. బీజేపీలో దలేర్ మెహంది చేరిన సమయంలో ఆయన వెంట హన్స్ కూడా ఉన్నారు.

Related posts

నీ స్పీడ్‌ కాంగ్రెస్‌ లో చెల్లదు ..రేవంత్‌ కు వీహెచ్‌ చురకలు

vimala p

మా అసోసియేషన్ ఎన్నికలు.. : నాగబాబు ఒకవైపు.. చిరంజీవి మరోవైపు.. !

vimala p

దుప్పట్లో సెక్స్… బిగ్ బాస్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

vimala p