telugu navyamedia
news political Telangana VOTE

తెలంగాణలో మరో ఎన్నికల పోరు..జనవరిలో పంచాయితీ ఎన్నికలు!

Nominations Starts For Sarpanch

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే అధికార యంత్రాంగం పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం ఆగస్టుతోనే ముగిసిన విషయం తెలిసిందే. గ్రామపంచాయితీ ఎన్నికలను జనవరిలో నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. జనవరిలో ఎన్నికలు నిర్వహించే విధంగా ఎన్నికల శాఖ సిద్దం చేస్తున్నారు. రిజర్వేషన్ల ఖరారు చేసే ప్రక్రియపై దృష్టి సారించిన అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. పంచాయితీలకు ప్రత్యేక అధికారుల కొనసాగింపు రాజ్యాంగ విరుద్దమని అక్టోబరు 11న హైకోర్టు వ్యాఖ్యానించింది.

జనవరి 15లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ తాజాగా హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. దీంతో అధికారులు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఉన్నతాధికారుల సూచన మేరకు బీసీ ఓటరు జాబితాను సిద్ధం చేశారు. పంచాయతీ, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ప్రక్రియలో కీలకం. ఈనెల15న బీసీ ఓటరు తుది జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు. అధికారుల సమాచారం మేరకు ఈనెల 25వ తేదీలోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ రానున్నట్లు తెలుస్తోందిపంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసులేదంటూ అసహనం వ్యక్తం చేసింది. అక్టోబరు 11 నుంచి మూడు నెలల వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగించవచ్చునని వెల్లడించింది.




తాజ్ మహాల్ … ఇక ఖరీదు

ప్రేమకు చిహ్నంగా ఎందరితోనో ఆరాదించబడుతూ, అద్భుత కట్టడంగా పేరుగాంచిన తాజ్ మహాల్ ను వీక్షించడానికి ప్రతి రోజు వేలమంది యాత్రికులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రాంతం మితిమీరిన కాలుష్యానికి గురిఅవుతుందని భావించిన ప్రభుత్వం అక్కడకు వచ్చే వీక్షకుల సంఖ్యను నియంత్రించే పనిలో పడింది. దీనిలో భాగంగా ప్రతి రోజు కొంతమందికే తాజ్ ను వీక్షించే అనుమతులు ఇవ్వడం, అదికూడా అధిక ధరలకు మాత్రమే ఇవ్వడం లాంటివి చేస్తుంది. ఈ ప్రయత్నం నీటితోనే అమలు కానుంది.

నిన్నటిదాకా ఒక్కో వీక్షకుడికి టికెట్ ధర 50 రూపాయలు ఉండగా, అది నేడు 250 అయ్యింది. ఇక విదేశీ టూరిస్టులకు అయితే 1300; సార్క్ దేశాల నుండి వచ్చే టూరిస్టులకు 540-740 రూపాయలు చేసేసింది. ఈ మేరకు ఆర్కియాలజికల్ సర్వే అఫ్ ఇండియా ఒక ప్రకటనను విడుదల చేసింది. అయితే 50 రూపాయల టికెట్ తీసుకున్న వారికి తాజ్ వెనుకవైపు ఉన్న యమునానది రివర్ నుండి వీక్షించే అనుమతి మాత్రమే ఇస్తున్నారు.



కళ్ళు చెదిరేలా అమరావతి  పనులు

Amaravathi
రాజధాని ప్రతిష్ఠను ఇనుమడింపజేసేలా నిర్మితమవుతున్న సెక్రటేరియట్‌ – హెచ్‌వోడీ టవర్లకు ఫౌండేషన్‌ ప్రక్రియకు ఏపీ సీఆర్డీయే సిద్ధమవుతోంది. దేశంలోనే ఇంతకు ముందెక్కడా కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 5 టవర్ల (ఒక్కొక్కటి 40 అంతస్థులతో 4టవర్లు, 50 అంతస్థులతో 1)కూ కలిపి 12 వేల క్యూబిక్‌ మీటర్ల మేర ఒకే ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ను వేయాలని నిర్ణయించిన ఏపీసీఆర్డీయే అమరావతికి మరో విశిష్ఠతను జోడించనుంది.
వేలాది కార్మికులు, నిపుణులతోపాటు భారీ ఎత్తున నిర్మాణ సామగ్రి, యంత్రాలు, సునిశిత ప్రణాళిక, అద్భుత సమన్వయం అవసరమయ్యే ఇంతటి ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ దేశంలో ఇదే ప్రథమని చెబుతున్నారు! 3 రోజులు రేయింబవళ్లు నిర్విరామంగా శ్రమిస్తే గానీ పూర్తవని ఈ బృహత్తర ప్రక్రియను త్వరలోనే చేపట్టాలని సీఆర్డీయే భావిస్తోంది. ఇందుకోసం పలు శాఖలు, సంస్థలు, నిష్ణాతులను సమన్వయపరచుకోవడంలో నిమగ్నమైంది.
అన్నీ వేలాది టన్నుల్లోనే.. సచివాలయం 5 టవర్లకు కలిపి సుమారు 13 అడుగుల లోతున వేసే 12 వేల క్యూ.మీ. అత్యంత భారీ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌కు అదే స్థాయిలో నిర్మాణ సామగ్రి అవసరం. దీనికోసం సుమారు 1300 టన్నుల స్టీల్‌, 3,000 టన్నుల సిమెంట్‌, 12,000 టన్నుల కంకర, 8,000 టన్నుల ఇసుక, 3,000 టన్నుల ఫ్లైయా్‌షతోపాటు 12 లక్షల లీటర్ల కృష్ణానదీ జలాలు కావాల్సి ఉంటుందని అంచనా వేశారు. వీటన్నింటినీ కలిపి కాంక్రీట్‌ మిక్సర్‌ తయారు చేసేందుకు 35 టన్నుల సామర్ధ్యం కలిగిన హెడ్‌ మిక్సర్లను వినియోగించాలి.
సామగ్రి తరలింపునకు భారీ ప్రణాళికలు.. భారీగా అవసరమయ్యే నిర్మాణ సామగ్రిని సచివాలయం నిర్మాణ ప్రాంతంలో ఉంచడం సాధ్యం కాదు కాబట్టి అవి లభ్యమయ్యే చోటు నుంచి వాటిని ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ వేసే రోజుల్లో నేరుగా చేర్చనున్నారు. వచ్చే వారం ఈ ప్రక్రియ ఓ కొలిక్కి రానుందని సమాచారం. అది పూర్తయిన వెంటనే బహుశా ఈ నెల 10- 16 తేదీల మధ్య ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ వేయవచ్చునని తెలుస్తోంది.
ఇదే సమయంలో.. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే పనులు ఆగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా దృష్టి సారించింది. ఇంతటి అత్యంత భారీ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ వేయబోతున్న సీఆర్డీయే.. కాంక్రీట్‌ టెక్నాలజీలో ప్రపంచంలోనే సుప్రసిద్ధ సంస్థలు, వ్యక్తుల మార్గదర్శకత్వంలో ఎప్పటికప్పుడు పలు పరీక్షలు చేయిస్తూ, వాటి ఫలితాల ఆధారంగా కార్యాచరణను రూపొందించుకుంటోంది.


తెలంగాణ వ్యాప్తంగా .. 144 సెక్షన్… మందు బందు…

144 section in telangana from

రేపు తెలంగాణాలో ఓట్ల లెక్కింపు సందర్భంగా హైదరాబాద్ తో సహా, రాష్ట్రం అంతటా 144 సెక్షన్ విధిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే రేపటి ఉదయం 6 గంటల నుండి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని కూడా అధికారులు ఆదేశించారు. అలాగే కౌంటింగ్ కేంద్రాలతో సహా ఎక్కడైనా 5 కంటే ఎక్కువ మంది గుమిగూడకుడదని అధికారులు హెచ్చరించారు.

మద్యం దుకాణాలు 11వ తేదీ ఉదయం నుండి 12వ తేదీ ఉదయం వరకు తెరవరదని; కల్లు తో సహా అన్ని బార్ అండ్ రెస్టారెంట్ లను, మిలిటరీ క్యాంటిన్ లకు కూడా ఇది వర్తిస్తుందని అధికారులు హెచ్చరించారు. ఇక అనుమతులు లేకుండా, ర్యాలీలు, ఊరేగింపులు లాంటివి జరిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాలలో బాణాసంచా కాల్చరాదని, పరిమితిని మించి పెద్ద శబ్దాలు చేసే వారిపైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

Related posts

మద్యం రవాణాకు .. ప్రత్యేక అంబులెన్సులు..

vimala p

రాజధానిలో.. కాంగ్రెస్ తో నడవనున్న కేజ్రీవాల్ .. బలవంతపు పెళ్లట..

vimala p

చిల్లర రాజకీయాలు మనుకోవాలి: : ఉత్తమ్‌

vimala p