telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

52 ఏళ్ళ వయసులో ఆమెకు 5వ పెళ్లి… 12 రోజుల్లోనే విడాకులు

Pamela

ప్రముఖ హాలీవుడ్ నటి పమేలా ఆండర్సన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. ప్రముఖ హాలీవుడ్ నటి పమేలా ఆండర్సన్ మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదో పెళ్లి చేసుకున్నారు. అందులోనూ 52 ఏళ్ల వయసులో. ప్రముఖ నిర్మాత జాన్ పీటర్స్‌తో ఈమె పెళ్లి జనవరిలో జరిగింది. జాన్‌కి కూడా ఇది ఐదో పెళ్లే. కానీ పెళ్లైన పన్నెండు రోజుల్లోనే ఇతన్ని కూడా వదిలేసిందట పమేలా. ఇందుకు కారణం ఇద్దరికీ ఒకరిపై ఒకరికి క్లారిటీ లేకపోవడమేనట. ఈ విషయాన్ని పమేలా మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘నన్ను జాన్ ప్రేమగా తన జీవితంలోకి ఆహ్వానించారు. సంతోషంగా ఉంది. మాకు ఒకరి జీవితం నుంచి మరొకరికి ఏం కావాలో తెలీడంలేదు. అది తెలిసే వరకు విడిగా ఉండాలని అనుకుంటున్నాం. ప్రస్తుతానికి పెళ్లి రద్దు చేసుకోవాలని అనుకుంటున్నాం” అని తెలిపారు. పమేలాకు జాన్ ఎంతో కాలంగా తెలుసుకానీ ఎప్పుడూ అతనితో కలిసి ఉండలేదని పమేలా సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం పమేలా కెనడాలో ఉన్న తన కుటుంబం వద్దకు వెళ్లిపోయారని పేర్కొన్నారు. జనవరి 20న పమేలా, జాన్ కాలిఫోర్నియాలోని మలీబూలో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైనట్లు అఫీషియల్ మ్యారేజ్ లైసెన్స్ లేదు. పమేలా విషయానికొస్తే… 1995లో టామీ లీ అనే నటుడ్ని పెళ్లి చేసుకున్నారు. మూడేళ్లకే అతనితో విడిపోయారు. ఆ తర్వాత కిడ్ రాక్ అనే మరో వ్యక్తిని పెళ్లాడారు. ఈ పెళ్లీ నిలవలేదు. మూడోసారి పోకర్ ప్లేయర్ రిక్ సాలోమన్‌ను వివాహం చేసుకున్నారు. ఇతనితో విడిపోయి మళ్లీ కలిసిపోయి మళ్లీ అతన్నే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ విడిపోయారు. ఇప్పుడు హాలీవుడ్ నిర్మాత జాన్ పీటర్స్‌ను పెళ్లి చేసుకున్నారు.

Related posts