telugu navyamedia
రాజకీయ వార్తలు

పాకిస్థాన్ఆ విషయంలో మాట నిలబెట్టుకోవాలి: అమెరికా

pakistan us

ఉగ్రవాద నేతలను అరెస్టు చేసి, తిరిగి విడుదల చేసే అలవాటున్న పాక్ తీరుపై అమెరికా దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయ కార్యదర్శి అలైస్‌ వెల్స్‌ ట్విట్టర్ ద్వారా స్పందించారు. పాకిస్థాన్ భవిష్యత్తు కోసం ఉగ్రవాదులను అంతమొందిస్తామని చెప్పిన ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తన మాటను నిలబెట్టుకోవాలని అమెరికా చెప్పింది.

ఇటీవల అరెస్టు చేసిన ఉగ్రవాదులపై విచారణ జరపాల్సిందేనని హెచ్చరించింది. ‘హఫీజ్ సయీద్ తో పాటు ఇతర ఉగ్రవాద నేతలపై విచారణ జరిపాలని లష్కరే తోయిబా జరిపిన భీకర దాడులకు బాధితులైన వారు కోరుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. ఆ ఉగ్రవాదులను అరెస్టు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే వారందరినీ తప్పక విచారించి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు.

Related posts